AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: శ్రీవారి భక్తులకు ఇది కదా కావాల్సింది.. ఇక కొండకు వచ్చే ప్రతీ సామాన్యుడికి

తిరుమలలో సామాన్య భక్తుడికి వసతి సమస్య తలెత్తకుండా టిటిడి ప్రయత్నిస్తోంది. యాత్రికుల వసతి సముదాయాన్ని మరొకటి అందుబాటులోకి తెచ్చింది. వెంకటాద్రి నిలయం పేరుతో పిఎసి-5 ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఆ వివరాలు ఇలా..

Andhra: శ్రీవారి భక్తులకు ఇది కదా కావాల్సింది.. ఇక కొండకు వచ్చే ప్రతీ సామాన్యుడికి
Tirumala
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 24, 2025 | 7:05 AM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు కొండకు చేరుకునే భక్తుల సంఖ్య దాదాపు 90 వేల దాకా ఉంటుంది. అయితే తిరుమలలో 45 వేల నుంచి 50 వేల మంది భక్తులకు మాత్రమే తిరుమల కొండపై వసతికి అవకాశం ఉంది. సామాన్యుడు నుంచి సంపన్నుడు దాకా తిరుమలలో అందుబాటులోని అతిథి గృహాలు, యాత్రికుల వసతి సబుదాయాలు, మఠాల్లో సేద తీరుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొండకు చేరే భక్తులకు వసతి సమస్యను తీర్చే ప్రయత్నంలో అదనపు వసతి కోసం పీఏసీ ఐదు నిర్మాణాన్ని అదనపు వసతి కోసం పీఏసీ-5 నిర్మాణాన్ని చేపట్టింది. 2018లో రూ. 102 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2,69,617 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల భవన నిర్మాణాన్ని రెండు బ్లాక్‌లుగా పూర్తిచేసింది. ఇందులో 16 డార్మెంటరీ హాల్స్ తోపాటు 2500 లగేజీ లాకర్లు అందుబాటులోకి తెచ్చింది. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులను నిర్మించింది.

ప్రతి అంతస్తులను రెండు చోట్ల ఆర్వో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అని కూడా అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలోని ఆర్టీసీ బస్టాండుకు దగ్గరగా భక్తులకు అందుబాటులో ఉండేలా పీఏసీ-5ను నిర్మించింది. దాదాపు 4 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా వెంకటాద్రి నిలయం అందుబాటులోకి తెచ్చిన టిటిడి ఈనెల 25న బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతోంది. మరోవైపు వెంకటాద్రి నిలయంలో చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది, దాదాపు 1500 మంది భోజనం చేసే విధంగా రెండు డైనింగ్ హాలు కూడా ఉన్నాయి. ప్రాథమిక చికిత్స కేంద్రాలు, కళ్యాణకట్ట అన్నప్రసాద వితరణ కేంద్రాలు లాంటి సదుపాయాలతో పాటు భక్తుల్లో ప్లాస్టిక్ వాడకం నిషేధమన్న విషయంపై అవగాహన కల్పించబోతోంది.

వేంకటాద్రి నిలయం సమాచారం..

PAC-5 గా వెంకటాద్రి నిలయం ఈ నెల 25 నుంచి అందుబాటులోకి వస్తుంది.

తిరుమలకు వచ్చే రోజువారీ భక్తుల సంఖ్య 80 వేల నుంచి 90 వేల దాక ఉంటుంది.

ప్రస్తుతం తిరుమలలో 45 వేల నుంచి 50 వేల మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం ఉంది.

అదనపు వసతి కోసం PAC- 5 నిర్మాణానికి 2018లో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది.

ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.102.00 కోట్లు.

2,69,617 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల భవనంగా నిర్మాణం జరిగింది.

ఇందులో మొత్తం 16 డార్మిటరీ హాల్స్ ఉన్నాయి.

దీంతో తిరుమలలో 2,500 మందికి అదనంగా వసతి సౌకర్యం ఉంటుంది. రద్దీ సమయంలో మరో వెయ్యి మంది వరకు వసతి పొందే అవకాశం.

2500 లగేజ్ లాకర్లు, మొత్తం 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదులు ఏర్పాటు.

ప్రతి అంతస్తులో 2 చోట్ల RO ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి.

ఈ భవనం RTC Bus స్టాండ్‌కు దగ్గరగా ఉంది కాబట్టి భక్తులు ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..