Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: స్టార్ హోటళ్లలో మద్యం తాగాలని ఉందా.? మీకో పండుగలాంటి వార్త

స్టార్ హోటళ్లలో లిక్కర్ యమా కాస్ట్లీగా ఉంటుంది. తాగాలంటే భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అయితే మందుబాబులకు గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం.. ఇకపై స్టార్ హోటళ్లలోనూ మద్యం తాగొచ్చు.. ఎలాగంటే ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి.

AP News: స్టార్ హోటళ్లలో మద్యం తాగాలని ఉందా.? మీకో పండుగలాంటి వార్త
Liquor
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Feb 08, 2025 | 9:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ హోటళ్ల బార్లలో మద్యం ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్టార్ హోటళ్లలో బార్ల వార్షిక లైసెన్స్ రుసుమును రూ. 67 లక్షల నుంచి తగ్గించే యోచనలో ఉంది. స్టార్ హోటళ్ల బార్లలో మద్యం ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం వాటి నిర్వహణ, పరిసరాలు, ఇతర ఖర్చులు. ఈ కారణంగా మద్యం ప్రియులు తక్కువ ధరలో మద్యం లభించే ఇతర బార్లను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇటీవలకాలంలో క్రమేపీ స్టార్ హోటళ్ల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని హాస్పిటాలిటీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వాన్ని కలిసి లైసెన్స్ ఫీజును తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలో రూ. 40 లక్షలు, తమిళనాడు, కేరళలో కేవలం రూ. 12 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని, అదే సమయంలో ఏపీలో అధికంగా ఉండటం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

నష్టాల్లో నడుస్తున్న స్టార్ హోటళ్లు..

స్టార్ హోటళ్ల యాజమాన్యుల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా హోటళ్లు నష్టాలలో నడుస్తున్నాయి. ఉదాహరణకు, గేట్‌వే వంటి ప్రముఖ హోటళ్లు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఈ విషయంపై హోటల్ అసోసియేషన్ ప్రతినిధి స్వామి మాట్లాడుతూ, “ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. లైసెన్స్ ఫీజును సుమారు రూ. 20 లక్షలకు తగ్గిస్తే మేము మరిన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 స్టార్ స్థాయి కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న 47 హోటళ్లలో 27 హోటళ్లు తక్కువ ఆదాయం వల్ల మూతపడ్డాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే హోటల్ పరిశ్రమకు, పర్యాటక రంగానికి ఉత్సాహం వస్తుందని అసోసియేషన్ నేతలు అభిప్రాయపడ్డారు.

మొత్తానికి, ఏపీలో హోటళ్ల బార్లలో మద్యం ధరలు తగ్గే అవకాశాలు..

ప్రభుత్వం తగిన విధాన మార్పులు చేస్తే, స్టార్ హోటళ్లలో మద్యం తక్కువ ధరకు లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లైసెన్స్ ఫీజు తగ్గితే, మద్యం ప్రియులకు మరింత అధిక బ్రాండ్లు, తక్కువ ధరలు లభించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి