Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త

ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలని.. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం ప్రారంభం చేయనున్నట్టు తెలిపారు.

AP News: మరో రెండు పథకాలకు ముహూర్తం ఖరారు.. ఏపీ ప్రజలకు పండుగలాంటి వార్త
Ap Cabinet
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 06, 2025 | 5:38 PM

ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో అటు మంత్రులు.. ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఐదు కీలక సూచనలు చేశారు. వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలి. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గేర్ మార్చి.. శాఖల పరంగా పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు.

ఇక అధికారులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకు సిద్ధమవ్వాలన్నారు. వచ్చే విద్యా ఏడాది ప్రారంభమయ్యేలోపే డీఎస్సీ పోస్టుల భర్తీ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలు రూపొంచించాలన్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని.. అలాగే ఏప్రిల్‌లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు. గేర్ మార్చాలి.. మంత్రులు ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

  1. వచ్చే మూడు నెలల పాటు మంత్రులు జనంలోకి వెళ్లాలి
  2. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
  3. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి
  4. మంత్రులు గేర్ మార్చాలి.. పనితీరు మెరుగుపడాలి
  5. పెట్టుబడులను పర్యవేక్షిస్తూ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..