Telangana: తెల్లారేసరికి పూజ కోసం షాప్ తెరవాలనుకున్నాడు.. తీరా కనిపించింది చూడగా
రోజూలానే ఆ వ్యక్తి పూజ చేయించేందుకు ఉదయాన్నే తన షాప్ దగ్గరకు వెళ్లాడు. తీరా అక్కడ ఎదురుగా కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఆ వివరాలు
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజీగూడలో రెండు మొబైల్స్ షాప్‌లలో చోరీలు జరిగాయి. స్థానికంగా ఉన్న SLN మొబైల్స్ షాప్‌తో పాటు MI మొబైల్ షాప్‌లోనూ చోరీకి పాల్పడ్డారు దుండగులు. 67 మొబైల్స్‌తో పాటు ఎల్ఈడీ టీవీలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. SLN షాప్ వద్ద చోరికి ప్రయత్నం చేసిన దొంగలు.. షాప్ షెట్టర్ తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న MI షాప్‌లో చోరీ చేశారు. చోరీ చేసే క్రమంలో ఒక్కరి కాలుకు గాయం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షెట్టర్ ముందు రక్తం ఉండటంతో పోలీసులు ప్రాధమికంగా ఓ నిందితుడికి గాయం అయి ఉంటుందని తేల్చారు.
మరోవైపు చోరీ జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. చోరీ సొత్తు విలువ సుమారు పదిహేను లక్షలుగా అంచనా వేస్తున్నారు. కాగా, మొబైల్ షాప్ యజమాని మల్లేష్ తన వెర్షన్ పోలీసులకు తెలిపారు. ‘రాత్రి షాప్ క్లోజ్ చేసి వెళ్ళామని.. ఉదయం 10 గంటలకు వచ్చి షాప్ చూసేసరికి షాప్ తాళాలు పగలకొట్టి ఉన్నాయని..’ వెంటనే పోచారం పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

విడాకులు కోరిన భార్య.. ఆ భర్త ఏం చేశాడో తెలుసా? వీడియో
