తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తున్న వైరస్.. లక్షల్లో కోళ్లు మృతి వీడియో
తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతోంది. కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయి.
బాదంపూడి, రేలంగి, మొగల్లు, పెద్ద తాడేపల్లి, దువ్వ వేల్పూర్, తణుకు, గుమ్మనిపాడు ప్రాంతాలలో కోళ్లు ఎక్కువుగా చనిపోతున్నాయి. ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్ దగ్గర రోజూ దాదాపు పదివేల కోళ్లు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది కోళ్ల మృతితో పశు సంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపారు. మరిన్ని కోళ్లకు వైరస్ సోకకుండా, చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా.. పాతిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.ఇటు తెలంగాణలోనూ వైరస్ కారణంగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వేలసంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అంతుచిక్కని వైరస్‌తో సత్తుపల్లి, కల్లూరు, విఎమ్ బంజరలోని పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల మృతిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
