పవిత్ర కుంభమేళాలో ఇవేం పనులు.. ఆగ్రహంతో సాధువులు ఏం చేశారంటే.. వీడియో
మహాకుంభమేళా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వేడుక. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మాంసాహారం నిషేధం. అంతేకాదు.. మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల విక్రయానికి కూడా ఇక్కడ అనుమతి లేదు. అలాంటి ప్రాంతంలో ఓ జంట చికెన్ వండే ప్రయత్నం చేశారు.
పవిత్ర కుంభమేళాకు వచ్చి మాంసాహారం వండుతున్న ఆ దంపతులపై సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గుడారాన్ని కూల్చివేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోను పరిశీలిస్తే.. చికెన్ వండిన జంటపై సాధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుతున్నారని తెలుసుకున్న సాధువులు వారి గుడారాన్ని తొలగించారు. వారిపై దాడి చేశారు. వారి ఆహారాన్ని కూడా పారబోశారు. పవిత్ర కుంభమేళాలో చేయకూడని పని చేసినందుకు వారిని వెళ్ళగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ జంట చర్యలపై నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

