విడాకులు కోరిన భార్య.. ఆ భర్త ఏం చేశాడో తెలుసా? వీడియో
భార్య విడాకులు కోరింది. అది అతనికి ఇష్టం లేదు. దాంతో ఆమె అతనితో కలిసి ఉండలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అంతే.. అతడి అహం దెబ్బతింది. ఈ క్రమంలో అతనేం చేశాడో తెలుసా? తన భార్య అని కూడా చూడకుండా ఆమె ప్రైవేటు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది భార్య కంటపడటంతో నిర్ఘాంతపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఈ జంటకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. వివాహం అయిన కొద్దిరోజులనుంచే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన ఆమె విడాకులు తీసుకుందామని భర్తను కోరింది. ఇది భర్తకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని భావించి ఆమె ప్రైవేటు ఫొటోలు, వీడియోలను అసభ్య కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇద్దరూ ఉపయోగిస్తుండటంతో ఆ వీడియోలు ఆమె కంటపడ్డాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇక వెళ్లిపోండి..ఆ ఇండియన్స్‌ని గెంటేస్తున్న ట్రంప్ వీడియో
అమ్మాయిలను ఆకర్షించడానికి డ్రగ్స్ తీసుకున్నా..షాకిచ్చిన బిల్‌గేట్స్
మూడంచెల భద్రతా వలయంలో.. మహా కుంభమేళా..వీడియో

మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..!

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో
