ఇక వెళ్లిపోండి..ఆ ఇండియన్స్‌ని గెంటేస్తున్న ట్రంప్ వీడియో
అమెరికా ఫస్ట్. ఈ నినాదం ఎఫెక్ట్ కేవలం అమెరికా వరకే కాదు. మొత్తం అంతర్జాతీయంగా కనబడింది. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తికి కేవలం అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ చరిష్మా తెచ్చి పెట్టిన స్లోగన్ ఇది. రెండోసారి ప్రెసిడెంట్‌గా అయినప్పుడూ ఇదే నినాదాన్ని మరోసారి వినిపించారు ట్రంప్. కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే దాన్నో ప్రచారాస్త్రంగా మార్చుకోకుండా...ప్రాక్టికల్‌గానూ అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాకి సంబంధించి సెక్యూరిటీ, డెవలప్‌మెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడను అని చాలా కచ్చితంగా తేల్చి చెప్పారు ట్రంప్.
ముఖ్యంగా అక్రమ వలసలపైనే ఫోకస్ పెట్టారు. అక్రమ మార్గంలో అమెరికాలోకి వచ్చి బతుకుతామంటే కుదరదు అని స్పష్టం చేశారు. అందుకే..రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే పని మొదలు పెట్టారు. అయితే..ఈ అక్రమ వలసదారుల్లో ఎంతో మంది భారతీయులున్నారు. వాళ్లందరినీ గుర్తించి క్రమంగా ఇండియాకి వెనక్కి పంపించేస్తోంది అమెరికా. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.
భారత్‌కి చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేకంగా ఓ మిలిటరీ ఫ్లైట్‌లో వెనక్కి పంపించే ప్రక్రియ మొదలు పెట్టింది అమెరికా. ఈ మేరకు 205 మందిని పంజాబ్‌లోని అమృత్‌సర్ వద్ద అప్పగించింది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా..అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వాళ్లను గుర్తించే పనిలో పడింది ట్రంప్ అధికార యంత్రాంగం. అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా డీపోర్టేషన్ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొదలైపోవడం వల్ల భారతీయుల్లో గుబులు మొదలైంది. దాదాపు 18 వేల మంది ఇండియన్స్..సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా ఉంటున్నట్టు లెక్క తేల్చారు.

నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్ కింద రూ.3 కోట్ల ఇల్లు

రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. వీడియో

తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..వీడియో

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో
