కుక్కను చూసి..భయంతో చెట్టెక్కిన చిరుత వీడియో
ఇటీవల వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో చిరుతలు, పులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి వీరిపై దాడి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రాణాలు కొందరు ప్రాణాలు కోల్పోతే, కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవల కొమురం భీం జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించిన చిరుతను గ్రామ సింహం ఉరుకులు పెట్టించింది. దెబ్బకు చిరుతను చెట్టెక్కించింది ఆ గ్రామ సింహం. సాధారణంగా పులులు, చిరుతల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవుల్లో అడవిపందుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రూర మృగాల ప్రత్యామ్నాయ ఆహారం కుక్కలు. అందుకే ఈ చిరుతలు, పులులు జనావాసాల్లోకి వస్తున్నాయని, ఈ క్రమంలోనే మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని ఇటీవల అటవీశాఖ అధికారులు వివరించారు.
వైరల్ వీడియోలు

మోటారు లేకుండానే ఉబికి వస్తున్న గంగ

కారును రైల్వే ప్లాట్ఫామ్పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
