Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 26, 27 రోజుల్లో వరుస సెలవులు వస్తున్నాయ్!

తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి నెలలో ఆదివారాలు కాకుండా అదనంగా మరో రెండు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. ఇప్పటికే జనవరి నెల మొత్తం వరుస సెలవుతో ఎంజాయ్‌ చేసిన విద్యార్ధులు.. ఫిబ్రవరి నెలలో కూడా సెలవులు రావడం సంబరం చేసుకుంటున్నారు. అసలింతకీ ఈ రెండు రోజులు సెలవులు ఎందుకు వచ్చాయో తెలుసా..

School Holidays: స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 26, 27 రోజుల్లో వరుస సెలవులు వస్తున్నాయ్!
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 06, 2025 | 2:25 PM

కొత్త ఏడాది ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పటికే న్యూఇయర్, సంక్రాంతితోపాటు ఇతర సెలవులంటూ జనవరి నెల మొత్తం జాలీగా గడిచిపోయింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో కేవలం ఆదివారాలు తప్ప మరే సెలవులు లేవు. ఈ నెలలో నాలుగు ఆదివారాలతో పాటు శివరాత్రి పండగ సెలవు మాత్రమే ఉంది. ఈ 5 రోజులు కాకుండా ఫిబ్రవరి నెల సెలవుల జాబితాలో మరో సెలవు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. అందుకు కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం. ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా నామనేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలోని స్కూళ్లకు పోలింగ్ రోజున సెలవు రానుంది.

గ్రాడ్యుయేట్‌ ఉద్యోగులు, స్కూల్ టీచర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఫిబ్రవరి 27న స్కూళ్లకు సెలవు ఇవ్వాల్సిందే. గతంలో టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన సర్కార్.. ఈసారి కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి పండగ వస్తుంది. ఆ రోజు పబ్లిక్‌ హాలిడే కాబట్టి సెలవు వస్తుంది. దీంతో ఫిబ్రవరి 26, 27 రెండ్రోజులు సెలవులు రానున్నాయి.

శివరాత్రి తర్వాత తెలంగాణతో పాటు ఏపీలో.. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో తెలంగాణలో ఈ జిల్లాల్లో సెలవురానుంది. అటు ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలకు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు వుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.