చోలీకే పీచే క్యా హై.. పాటకు పెళ్లి కొడుకు డ్యాన్స్‌! దెబ్బకు పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి..

పెళ్లి పందిట్లో వరుడి తరపు వారికి ఏ మాత్రం కోపం రాకుండా వధువు తరపు బంధువులు ఎంతో జాగ్రత్తగా మెలగడం ప్రతి చోట ఉండేదే. అయితే ఓ పెళ్లిలో మాత్రం వరుడు చేసిన ఒకే ఒక్కపని పెళ్లి కూతురు తండ్రికి పట్టరాని కోసం తెప్పించింది. అంతే దెబ్బకు పెళ్లి క్యాన్సిల్ చేసి అక్కడి నుంచి కూతురిని తీసుకుని వెళ్లిపోయాడు. పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రిని బతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది..

చోలీకే పీచే క్యా హై.. పాటకు పెళ్లి కొడుకు డ్యాన్స్‌! దెబ్బకు పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి..
Wedding Cancelled Over Groom Dance
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2025 | 12:51 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మరి కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చుని వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి ఉండగా.. ఇంతలో వరుడి స్నేహితులు డ్యాన్స్‌ చేయమని వరుడిని బలవంతం చేశారు. దీంతో చేసేదిలేక వరుడు తన స్నేహితుల అభ్యర్థన మేరకు ఓ సినిమా పాటకు స్టెప్‌లు వేశాడు. కానీ వరుడు పెళ్లి పందిట్లో కుప్పి గంతులు వేయడం చూసిన వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దెబ్బకు పెళ్లి రద్దు చేసుకుని అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయారు. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలో జనవరి 18న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం..

ఢిల్లీలో జనవరి 18వ తేదీన ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. వరుడు ఊరేగింపుతో వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే అదే సమయంలో అక్కడవున్న వరుడి స్నేహితులు డ్యాన్స్‌ చేయడమని బలవంతం చేశారు. దీంతో స్నేహితుల అభ్యర్థన మేరకు వరుడు ప్రముఖ బాలీవుడ్‌ సాంగ్‌ ‘చోలీకే పీచే క్యా హై’ హిందీ పాటకు కాసేపు సరదాగా డ్యాన్స్‌ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన అతిథులు వరుడి డ్యాన్స్‌ను మరింత ప్రోత్సహిస్తూ చప్పట్లు కొడుతూ సందడిగా అందరూ గడిపారు. అయితే వరుడి చర్యను వధువు తండ్రికి సుతారం నచ్చలేదు. కాసేపట్లో పెళ్లి తంతు జరగనుండగా వరుడు చేసిన పని తనకేమాత్రం నచ్చలేదని, అలసది అనుచితంగా ఉందని వధువు తండ్రి అంత ఎత్తున ఎగిరిపడ్డాడు. అంతేకాకుండా వరుడి ప్రవర్తన తమ కుటుంబ విలువలను అవమానించేలా ఉందని, ఇలాంటి వ్యక్తికి తన కూతిరినిచ్చి పెళ్లి చేయబోనని తెగేసి చెప్పి, పెళ్లి రద్దు చేస్తున్నట్లు క్షణాల్లో ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

దీంతో కన్నీళ్ల పర్యంతమైన వధువు తన తండ్రికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇదంతా కేవలం సరదా కోసమేనని వివరించి చెప్పినా ఆయన నిర్ణయం మార్చుకోలేదు. వధువు తండ్రి.. వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఆయన కోపం తగ్గలేదు. పైగా ఇకపై తమ కుటుంబానికి, వారి కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉండవని బంధువులందరి సమక్షంలో ప్రటించాడు. ఇక ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్గా మారింది. అతిథులను సంతోషపెట్టడానికి వరుడు ‘చోళీ కే పీచే’ సాంగ్‌కు డ్యాన్స్ చేయగా.. వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు అనే క్యాప్సన్‌తో ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వరుడి మామ సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే ఈ డ్యాన్స్‌ రోజూ చూడాల్సి వచ్చేది’ అంటూ ఒకరు, ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు, ఇది ఎలిమినేషన్ రౌండ్ అంటూ మరొకరు కామెంట్‌ సెక్షన్‌లో సరదాగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.