Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నీ.! ఈ ఎలక్ట్రీషియన్ తెలివి చూస్తే.. ఇంజనీర్లు కూడా హ్యాట్సాఫ్ అనాల్సిందే

భారతదేశంలో చదువుకోని పట్టభద్రులెందరో మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోయారు. అయితే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ప్రతిభావంతులెందరో వెలుగులోకి వస్తున్నారు. తాము చేసే పని సక్రమంగా, సులువైనమార్గాల్లో పూర్తి చేసేందుకు వారు చేసే ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు..

Viral: ఓర్నీ.! ఈ ఎలక్ట్రీషియన్ తెలివి చూస్తే.. ఇంజనీర్లు కూడా హ్యాట్సాఫ్ అనాల్సిందే
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 07, 2025 | 1:21 PM

భారతదేశంలో చదువుకోని పట్టభద్రులెందరో మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోయారు. అయితే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ప్రతిభావంతులెందరో వెలుగులోకి వస్తున్నారు. తాము చేసే పని సక్రమంగా, సులువైనమార్గాల్లో పూర్తి చేసేందుకు వారు చేసే ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఎలక్ట్రీషియన్‌ చేసిన తెలివైన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్‌ అంటున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా..

కొందరు ఎలక్ట్రీషియన్లు కొత్తగా నిర్మించిన ఓ ఇంట్లో వైరింగ్ పని చేస్తుంటారు. వారిలో ఓ వ్యక్తి ఇంట్లో స్టాండ్ వేసుకుని సీలింగ్‌లో వైరింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రమంలో ఓ ఖాళీ పైపును కిందకు లాగాడు. అందులో అతను అక్కడ చేయాల్సిన వైరింగ్‌ పనికి సంబంధించిన వైర్లు లాగాలి. అదే సమయంలో ఆ పైపు లోకి వైర్లు పంపేందుకు మేడ పైన మరో ఎలక్ట్రీషియన్ ఎదురు చూస్తుంటాడు. అయితే చాలా పైపులు ఉండడంతో ఎందులో నుంచి వైరు పంపాలో పైన ఉన్న అతనికి అర్థం కాలేదు. దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తి తెలివిగా ఆలోచించాడు. వెంటనే తన జేబులోని సిగరెట్ ప్యాకెట్‌ తీసి ఓ సిగరెట్‌ వెలిగించి, గట్టిగా రెండుమూడు దమ్ములు లాగాడు. అనంతరం పొగలు బయటకు వదిలేయకుండా వైర్లు పంపాల్సిన పైపులోకి వదిలాడు.

ఇవి కూడా చదవండి

దాంతో ఆ పొగ మొత్తం ఆ పైపులోనుంచి ఇంటిపై ఉన్న పైపు గుండా బయటికి వచ్చింది. దాన్ని చూసి ఆ వ్యక్తి ఆ పైపు గుండా వైర్లను పంపించేసాడు. దీంతో వారి పని సులభమైపోయింది. ఇలా సిగరెట్ పొగను వైరింగ్ చేసేందుకు వాడుకున్న ఇతడి తెలివితేటలుకి అంతా ముక్కున వేలేసుకున్నారు. సిగరెట్లు ఇలా కూడా ఉపయోగపడతాయా అని ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 64 వేలమందికి పైగా వీక్షించారు. వందలమంది లైక్‌ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..