Viral: అనారోగ్యంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూడగా కంగుతిన్న డాక్టర్లు
ఓ వ్యక్తి ఉడకని పంది మాంసం తిని విచిత్రమైన రోగం బారిన పడ్డాడు. అతడు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. డాక్టర్లు ఎక్స్ రే తీశారు. ఇక ఆ ఎక్స్ రే చూసి దెబ్బకు దడుసుకున్నారు డాక్టర్లు.. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..

సాధారణంగా డాక్టర్లు ప్రతీ రోజూ చిత్రవిచిత్రమైన కేసులు చూస్తుంటారు. అలాంటి ఓ కేసు స్టడీ ఇది. డాక్టర్ శామ్ ఘలి దీనిని ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఓ మెడికల్ కేస్ స్టడీలో భాగంగా పరాన్నజీవులు నిండిన ఒక ఎక్స్‌రే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరిగ్గా ఉడకని పంది మాంసం తిని.. ఓ వ్యక్తి శరీరమంతటా కాల్సిఫైడ్ పరాన్నజీవులు ఫామ్ అయ్యాయి. ఇలా పరాన్నజీవులు నిండిన ఈ వ్యాధిని ‘సిస్టిసెర్కోసిస్’ వ్యాధి అని పిలుస్తారట. లార్వా తిత్తులు సోకిన పచ్చి లేదా ఉడకని పంది మాంసం తినడం ద్వారా పరాన్నజీవులు మనుషులకు సోకుతాయన్నారు. ఈ టేప్‌వార్మ్‌లు మానవ శరీరంలో కొద్ది వారాల్లో పరిపక్వత చెంది.. గుడ్లు పెట్టి.. మరిన్ని టేప్‌వార్మ్‌లను ఫామ్ చేస్తాయి.
టేప్‌వార్మ్ లార్వాలు మానవ శరీరంలోని మృదు కణజాలాలలోకి చేరి వృద్ది చెందుతాయి. ఇక ఈ వ్యాధి సోకినా వ్యక్తులు వాడిన వస్తువులు లేదా బాత్‌రూమ్‌ను వేరేవాళ్లు ఉపయోగించకూడదని డాక్టర్లు చెబుతున్నారు. అలా చేస్తే సిస్టిసెర్కోసిస్ వ్యాధి వేరొకరికి సోకుతుందని చెప్పారు. సరిగ్గా వండని పంది మాంసం తినవడం వల్ల కలిగే నష్టాలు అన్నీఇన్ని కాదని డాక్టర్లు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కండరాలు, చర్మం దెబ్బతినడం, మెదడు మొద్దుబారిపోవడం జరుగుతుందట. మరి మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Here’s a video I made breaking down one of the most insane X-Rays I’ve ever seen#FOAMed pic.twitter.com/wp8xtGFTV5
— Sam Ghali, M.D. (@EM_RESUS) January 16, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి