AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre Incident: చికెన్ ర్యాప్ తింటుంటే దిమ్మతిరిగే షాక్..! వామ్మో.. ఇంతకీ ఏమైందో తెలుసా

వేడి వేడి చికెన్ ర్యాప్.. అబ్బ నోరూరించే అద్భుతమైన ఫుడ్ రెసెపీ.. అయితే.. అలాంటి చికెన్ ర్యాప్‌ను తినేందుకు ఓ మహిళ ఫేమస్ కేఫ్ కు వెళ్లింది.. అక్కడ ఆర్డర్ ఇవ్వగానే.. వెయిటర్ తెచ్చి ఇచ్చాడు.. చికెన్ వ్రాప్ ను నోట్లో పెట్టుకోగానే అనుకోని సంఘటన ఎదురైంది.. ముందు కొంచెం తిన్నది..

Bizarre Incident: చికెన్ ర్యాప్ తింటుంటే దిమ్మతిరిగే షాక్..! వామ్మో.. ఇంతకీ ఏమైందో తెలుసా
Chicken Wrap
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2025 | 10:26 AM

Share

వేడి వేడి చికెన్ ర్యాప్.. అబ్బ నోరూరించే అద్భుతమైన ఫుడ్ రెసెపీ.. అయితే.. అలాంటి చికెన్ ర్యాప్‌ను తినేందుకు ఓ మహిళ ఫేమస్ కేఫ్ కు వెళ్లింది.. అక్కడ ఆర్డర్ ఇవ్వగానే.. వెయిటర్ తెచ్చి ఇచ్చాడు.. చికెన్ వ్రాప్ ను నోట్లో పెట్టుకోగానే అనుకోని సంఘటన ఎదురైంది.. ముందు కొంచెం తిన్నది .. ఆ తర్వాత మరోసారి దానికి కొరకగానే.. ఏదో పదునైన వస్తువు తగిలింది.. చికెన్ ర్యాప్ లో కత్తి ఉండటంతో దెబ్బకు షాకైంది.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. ఒక ఆస్ట్రేలియన్ కంటెంట్ క్రియేటర్.. స్థానిక కేఫ్ నుంచి చికెన్ ర్యాప్ ను ఆర్డర్ చేసింది.. అయితే.. ఆమె ఆ చికెన్ ర్యాప్‌లో కత్తిని కనుగొనడంతో తృటిలో గాయం నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత.. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆమె కథనం వైరల్ అయ్యింది.. ఇది సోషల్ మీడియాలో ఆందోళన.. అవిశ్వాసాన్ని రేకెత్తించింది.

ఆస్ట్రేలియన్ మహిళ తాను.. చికెన్ వ్రాప్ లో కత్తిని కనుగొంది.. అయితే.. ఈ సమయంలో గాయం నుంచి తృటిలో తప్పించుకున్నప్పుడు షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌకర్యవంతమైన ఫుడ్ డెలివరీ సేవలు బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, ఈ సంఘటన సంభావ్య ప్రమాదాలను నొక్కి చెబుతుంది..

ఈ మేరకు ఎమిలీ అనే కంటెంట్ క్రియేటర్ అయిన మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆకలితో ఉన్న ఆమె స్థానిక కేఫ్ నుండి చికెన్ ర్యాప్ ఆర్డర్ చేసింది. ఆమె తినడం ప్రారంభించినప్పుడు.. ఆమె ఊహించని విధంగా గట్టిగా ఒక్కసారిగా దాన్ని కొరికింది.

మొదట్లో దానిని క్యారెట్‌గా భావించానని.. ఈ సమయంలో గట్టిగా కొరికానని.. కానీ.. అది గుచ్చుకోలేదని పేర్కొంది.. చికెన్ వ్రాప్ ను పరిశీలించినప్పుడు.. ఆరెంజ్ కలర్ హ్యాండిల్‌తో ఉన్న కత్తిని ఆమె కనుగొంది. అయితే.. ఆ పదునైన కత్తి భాగం కింద ఉండటంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపింది.

అయితే.. ఎమిలీ కథనం వైరల్ అయింది.. నెటిజన్లు ఈ ఘటనపై కామెంట్లు చేయడంతోపాటు.. షేర్ చేస్తూ.. కేఫ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.. దీంతోపాటు.. ఆందోళన, అవిశ్వాసం వ్యక్తం చేశారు.

తమాషా.. ఇది భయానకంగా ఉంది ఉందంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరికొందరు ఆమె బాధాకరమైన అనుభవానికి పరిహారం కోరవచ్చని సూచించారు. కొంతమంది వినియోగదారులు హాస్యంతో ప్రతిస్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం