AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదేందిది మావా.! బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలానాలు చూసి కంగుతిన్న పోలీసులు

బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో కెక్కాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్‌పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. రూ.1.60లక్షల జరిమానా విధించిన పోలీసులు అతడి బైక్‌ను సీజ్‌ చేశారు. చివరకు ఆ జరిమానా మొత్తం..

Viral: ఇదేందిది మావా.! బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలానాలు చూసి కంగుతిన్న పోలీసులు
Viral
Ravi Kiran
|

Updated on: Feb 07, 2025 | 12:15 PM

Share

బెంగళూరుకు చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు వార్తల్లో కెక్కాడు. రికార్డు సంఖ్యలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటమే అందుకు కారణం. అతడి స్కూటర్‌పై ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. రూ.1.60లక్షల జరిమానా విధించిన పోలీసులు అతడి బైక్‌ను సీజ్‌ చేశారు. చివరకు ఆ జరిమానా మొత్తం చెల్లించిన వాహనదారుడు బైక్‌ను తీసుకొని వెళ్లిపోయాడు.

బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామి ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. అతడి స్కూటర్‌పై రికార్డు స్థాయిలో ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, జర్నీలో మొబైల్‌ వాడకం, సిగ్నల్‌ జంప్‌ తదితర కేసులున్నాయి. అయిన్నప్పటికీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యక్తి వాహన చలానాలను ఏడాది కాలంగా గమనిస్తూ వస్తున్న స్థానికంగా ఉన్న మరో వ్యక్తి .. ‘ఆ బైక్‌ను పోలీసులు ఇంకా ఎందుకు సీజ్‌ చేయలేదంటూ’ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ట్రాఫిక్‌ ఉల్లంఘన, జరిమానాలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను జతచేశాడు.

ఆ పోస్టును చూసి మేల్కొన్న బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు.. సదరు స్కూటర్‌పై 311 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆ చలానాలన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే 20 మీటర్లు పొడవు ఉన్నాయి. మొత్తంగా 1,61,500 రూపాయల ఫైన్‌ విధించిన సిటీ మార్కెట్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనాన్ని సీజ్‌ చేశారు. అయితే, మరుసటి రోజే వాహనదారుడు వచ్చి చలాన్‌ చెల్లించి బైక్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అతడికి పోలీసులు స్పష్టంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్