Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..

రోజూలానే ఆ వ్యక్తి తనకు ఇష్టమైన కోడి మాంసం తెచ్చుకునేందుకు షాప్‌నకు వచ్చాడు. దగ్గరుండి చికెన్ ముక్కలు కొట్టించుకున్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఆ స్టోరీ ఏంటంటే.? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందామా మరి.

AP News: లొట్టలేసుకుంటూ కోడి మాంసం తినాలనుకున్నాడు.. తీరా ఇంటికి వచ్చేసరికి..
Representative Image
Follow us
T Nagaraju

| Edited By: Ravi Kiran

Updated on: Feb 06, 2025 | 7:40 PM

తురకా కిషోర్.. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగిన పేరు.. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల కారుపై పెద్ద కర్రతో దాడి చేసిన సంచలనం సృష్టించిన వ్యక్తి తురకా కిషోర్. వైసీపీకి చెందిన తురకా కిషోర్ ఆ తర్వాత మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యాడు. గత ఎన్నికల సమయంలోనూ అల్లర్లకు పాల్పడిన తురకా కిషోర్, అతడి తమ్ముడిపై మాచర్ల పిఎస్ పరిధిలో అనేక కేసులున్నాయి. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం పోలీసులు అనేక చోట్ల గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఆరు నెలల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. చివరికి విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. మరొకవైపు తురకా కిషోర్‌ను పట్టుకోలేకపోవడంతో పోలీసులపై ఒత్తిడి కూడా పెరిగింది.

దీంతో తురకా కిషోర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన వెంటనే ఫోన్ నంబర్‌ను మార్చేశాడు. తెలిసిన వాళ్లెవరితోనూ మాట్లాడటం మానేశాడు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది. అయితే హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉన్న జైపురి కాలనీలో ఉంటున్నట్లు పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులు రైడ్ చేసి తురకా కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కిషోర్ జైల్లో ఉన్నాడు.

ఎలా పట్టుకున్నారంటే..

కిషోర్ ఫోన్ నెంబర్ మార్చేయడంతో అతన్ని పట్టుకునేందుకు అతని బ్యాంక్ ఖాతాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ మార్చేసినా.. ఫోన్ పే వాడుతున్నట్లు గుర్తించారు. జైపురి కాలనీలోని ఒక చికెన్ షాపులో ఆ ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. తరుచుగా అదే షాపులో చికెన్ కొంటున్నట్లు తేల్చిన తర్వాత ఒక నిఘా టీంను హైదరాబాద్ పంపించారు. కిషోర్ కదలికలను తెలుసుకున్న తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆరునెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన కిషోర్ ఆచూకీ చివరికి కోడి మాంసం పట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..