AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒక్కసారిగా అరుపులు మొదలెట్టిన ఫారం కోళ్లు.. యజమాని ఏంటా అని వెళ్లి చూడగా..

పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు మండలంలో శనివారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మక్కువలోని సువర్ణముఖి నది వంతెన సమీపంలోని చికెన్ సెంటర్‌లోకి 15 అడుగుల పొడవైన కొండచిలువ ప్రవేశించి, అక్కడున్న రెండు కోళ్లను మింగేసింది. గ్రామస్తులు ధైర్యం చేసి ఆ పామును హతమార్చారు.

Andhra: ఒక్కసారిగా అరుపులు మొదలెట్టిన ఫారం కోళ్లు.. యజమాని ఏంటా అని వెళ్లి చూడగా..
Python
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 20, 2025 | 7:25 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం మక్కువలోని సువర్ణముఖి నది వంతెన సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లోకి ఒక భారీ కొండచిలువ ప్రవేశించింది. అకస్మాత్తుగా వచ్చిన ఆ పాము అక్కడే ఉన్న రెండు కోళ్లను అమాంతం మింగేసింది. ఆ తరువాత మరో కోడిని చుట్టేసి చంపే ప్రయత్నం చేసింది. దీంతో కోళ్లు ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో మొత్తం కోళ్లఫారం‌లో కలకలం రేగింది. ఆ శబ్దం విన్న షాపు యాజమాని ఫారం లోపలకి వెళ్లి చూసే సరికి 15 అడుగుల పొడవైన కొండచిలువ కోళ్ల పై దాడి చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే అతను స్థానికులను అప్రమత్తం చేశారు. కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి కొండచిలువను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొండచిలువ వారిపై దాడికి యత్నించింది. అయితే మనుషులను కూడా మింగే స్వభావం ఉన్న కొండచిలువ కావడంతో అంతా హడలిపోయారు. కొంతసేపు అంతా భయానకంగా మారింది. చివరికి అందరూ కలిసికట్టుగా ఆ పామును హతమార్చారు.

ఈ ఘటన చోటుచేసుకున్న వెంటనే ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అంత పెద్ద కొండచిలువను ప్రత్యక్షంగా చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇంత భారీ పాము జనావాసంలోకి రావడం అందరినీ తీవ్రంగా భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరగకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాలూరు ప్రాంతంలో ఇటీవల ఏజెన్సీ నుంచి వన్యప్రాణులు గ్రామాల వైపు వస్తున్న సంఘటనలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన మరల వన్యప్రాణుల రక్షణ, గ్రామాల భద్రతపై చర్చకు దారితీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..