అనుమానంతో చితకబాదారు.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

ఇంకేముంది. అందర్నీ పిలిచి, తలో చేయి వేసేశారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి అప్పగించారు. వన్‌టౌన్‌ పీఎస్‌కి తీసుకెళ్లి విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆ నలుగురూ..

అనుమానంతో చితకబాదారు.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Kurnool
Follow us

|

Updated on: Oct 02, 2022 | 6:50 AM

కర్నూలులో కిడ్నాప్‌ కలకలం రేగింది. పిల్లలను ఎత్తుకుని పోతున్నారనే అనుమానంతో నలుగురిని పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. అందర్నీ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ప్రతీ ఒక్కరూ తలో చెయ్యేశారు. పిల్లలను కిడ్నాప్‌చేసే ముఠాగా భావించి రక్తాలు వచ్చేలా కొట్టారు. కర్నూలు పాతబస్తీలో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. పిల్లలను ఎత్తుకుని పోతున్నారనే అనుమానంతో నలుగురిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానిక యువకులు పట్టుకున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం పెనుభూతమైంది.

ఇంకేముంది. అందర్నీ పిలిచి, తలో చేయి వేసేశారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి అప్పగించారు. వన్‌టౌన్‌ పీఎస్‌కి తీసుకెళ్లి విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆ నలుగురూ బిచ్చగాళ్లుగా తేలింది. ఈ ఇన్సిడెంట్‌పై కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్‌ సీరియస్‌గా రియాక్టయ్యారు. కర్నూలులో పిల్లల్ని ఎత్తుకునిపోయే ఎలాంటి ముఠాలు తిరగడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎవరికైనా అనుమానాలుంటే, పోలీసులకు సమాచారం ఇవ్వాలే గాని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అనుమానం పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహేష్‌ హెచ్చరించారు.