AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అమ్మో..! విశాఖలో ఎగిరే పాము… మీరెప్పుడైనా చూశారా..?

పాములు పాకుతూ ఉంటాయి.. కానీ ఎగరడం ఎక్కడైనా చూసారా..? చూసి ఉండొచ్చు... ఎక్కడో టీవీలోనో.. సినిమాల్లోనో.. కానీ అలా ఎగిరే స్నేక్ డైరెక్ట్‌గా మీ కళ్ల ముందు కనిపిస్తే..! అది కూడా ఎన్నడూ చూడని విధంగా శరీరంపై నలుపు, ఎరుపు, గోల్డ్ రంగుల రింగులుగా చారలతో అందంగా కనిపిస్తే..! ఒక క్షణానికి కాస్త వింతగా అనిపించినా.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే అది సర్పం కదా..! అదే పరిస్థితి ఎదురయింది విశాఖలో ఓ కుటుంబానికి. అరుదైన ఆ సర్పం ఆ కుటుంబాన్ని వణికించింది.

Andhra: అమ్మో..! విశాఖలో ఎగిరే పాము... మీరెప్పుడైనా చూశారా..?
Rare Snake
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 28, 2025 | 11:02 AM

Share

విశాఖలో అరుదైన పాము కనిపించింది. డాల్ఫిన్స్ నోస్ నేవల్ క్వార్టర్స్‌లో ఓ ఇంటిపై కదులుతూ ఉంది. అయిదవ అంతస్తులు నెమ్మదిగా పాకుతూ ఉండడాన్ని గమనించి ఆ కుటుంబం హడాలెత్తిపోయింది. అయితే మొదట్లో అది జెర్రీ లాంటి జీవి అని అనుకున్నారు.. ఎందుకంటే ఆ పాము పరిమాణం చిన్నదిగా ఉండడం.. దాంతోపాటు శరీరంపై నలుపు, ఎరుపు, బంగారు వర్ణంలో చారలు ఉండడంతో.. కాస్త దగ్గరగా చూసారు. దీంతో అది పాము అనుకుని నిర్ధారించుకొని హడలెత్తిపోయారు. వెంటనే పాములు పట్టే నేర్పరి అయిన నాగరాజుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నాగరాజు.. ఆ పామును సేఫ్‌గా రెస్క్యూ చేశాడు.. సమీపంలోని చెట్లపై విడిచిపెట్టాడు. దీంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. విషయం ఆ నోట ఈ నోట పాకింది. దీంతో రెండు అంతస్తుల మేడపై ఉన్న ఈ పామును చూసేందుకు జనం తరలివచ్చారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పామును వాళ్లు చూడకపోవడంతో ఆసక్తిగా తిలకించారు. ‘సహజంగా ఈ పాములు ఒకే వాతావరణానికి అలవాటు పడతాయి.. ఏ ప్రాంతంలో కనిపిస్తాయో.. అటువంటి వాతావరణంలోనే వాటిని విడిచి పెట్టాలి.. చెట్లపైనే ఎక్కువగా వాటి ఆవాసం.. ఇవి మనిషి ప్రాణాలకు హాని తలపెట్టే అంత విషపూరితం కావు.. ఎక్కడైనా ఇటువంటి పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి’ అని కోరాడు స్నేక్ క్యాచర్ నాగరాజు.

ఇది ఎగిరే పాము..!

ఈ పాము శాస్త్రీయ నామం క్రిసోపెలియా ఆర్నాటా. దక్షిణ, ఆగ్నేయాసియాలో కనిపించే తేలికపాటి విషపూరితమైన పాము. దీనిని బంగారు చెట్టు పాము, బంగారు ఎగిరే పాము అని కూడా పిలుస్తారు. సరీసృపాలలో చాలా జీవులు పాకుతూ ఉంటాయి. దాదాపు పాముల జాతులన్నీ పాకుతూ కదలికలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ పాము మాత్రం.. ఎత్తైన భవనం గాని.. చెట్టు గాని ఎక్కి.. అక్కడ నుంచి మరో చోటకి ఎగురుతుంది.

Snake

రాత్రిపూట సంచరించడం సహజ లక్షణం..

ఈ పాముకు రాత్రిపూట సంచరించడం సహజ లక్షణం. తన శరీరాకృతిని ఒక చోట నుంచి మరో ప్రాంతానికి దూకేలా.. ఎగిరేందుకు మలుచుకుంటూ వెళుతుంది. ఒక్కో సమయంలో చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంది. చెట్టు పైకి పాకుతూ ఎత్తైన ప్రాంతం నుంచి మరోచోటకి దూకే ప్రయత్నం చేస్తుంది.

100 మీటర్ల దూరం వరకు దూకగలవు..

ఇండియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, చైనా దేశాల్లో ఈ పాములు కనిపిస్తాయి. ఇవి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగురుతాయి. ఇవి దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగరగలవు. ఎక్కువగా ఆహారం కోసమే ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు దూకుతాయి. ఈ పాములు బల్లులు, కప్పలు, పక్షులు, ఎలుకలను తింటాయి. ఈ పాములు వాటి తోకను ల్యాండింగ్‌ గేర్‌గా ఉపయోగించుకుంటాయి. దూకిన తరువాత చెట్టు కొమ్మల మీద ముందుగా తోకను తాకిస్తాయి. అయితే గాలిలో ఇవి తమ దిశను మార్చుకోలేవు. ఒకే దిశలోనే దూకుతాయి. ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిలో కొన్ని వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ పాములు రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు పొడవు ఉంటాయి. ఇది విషపూరిత సర్పమే అయినప్పటికీ మనుషుల ప్రాణానికి హాని తలపెట్టినంత విషం ఉండదు. ఆహారం కోసం, శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం మాత్రమే ఇవి ఎదురుదాడి చేస్తుంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..