Madanapalle: ఫైల్స్ దగ్ధం కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు.. ముగ్గురు పోలీసులపై వేటు

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లోని ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్విస్టిగేషన్‌ స్పీడప్‌ చేశారు పోలీసులు. పలువురు రెవన్యూ అధికారులను సైతం అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీస్‌శాఖపై తొలి వేటు పడటం చర్చనీయాంశమైంది.

Madanapalle: ఫైల్స్ దగ్ధం కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు.. ముగ్గురు పోలీసులపై వేటు
Madanapalle Sub Collector Office
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2024 | 7:25 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులోని ఫైల్స్‌ దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. గత మూడు రోజులుగా రెవెన్యూ, పోలీసు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో బాధ్యులుగా ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ వలీబస్‌ను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు పైఅధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సీఐను వీఆర్‌కు పంపారు. ఆయనతో పాటు నైట్‌ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు హరిప్రసాద్‌, భాస్కర్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇక సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలను సేకరించారు అధికారులు. ఆదివారం రాత్రి 10గంటల 40 నిమిషాల వరకు సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ ఆఫీసులోనే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు… గౌతమ్‌ బీరువాలో ఇంజిన్‌ ఆయిల్‌ ఉన్నట్లు తెలిపారు. మరోవైపు 11 మండలాల తహశీల్దార్ల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ జీపీలతో జరిగిన రిజిస్ట్రేషన్లపైనా విచారిస్తున్నారు. ఇటు వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు… పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. అలాగే కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొత్తంగా… కుట్రపూరితంగా జరిగిందన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్‌ జరుగుతోంది. ఒకటి, రెండ్రోజుల్లో నిందితులు ఎవరో తేలుస్తామంటున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..