AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: పీతపై కనిపించిన ఆకారం చూసి ఆశ్చర్యపోయిన జనం..

సఖినేటిపల్లి లంకకు చెందిన రైతు కాగితం కృష్ణ మంగళవారం మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన పీతల్లో విచిత్రమైన పీత ఒకటి కనిపించింది. వంట చేయడానికి సిద్ధం చేస్తున్న సమయంలో పెంకుపై నరసింహ స్వామి ఆకారం చూసి ఆ రైతు ఆశ్చర్యపోయాడు.

Konaseema: పీతపై కనిపించిన ఆకారం చూసి ఆశ్చర్యపోయిన జనం..
Crab
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2024 | 7:27 PM

Share

అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

కాగితం కృష్ణ అనే వ్యక్తి ఎప్పటిలాగానే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతలు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. క్లీన్ చేస్తున్న సమయంలో ఒక పీత విచిత్రంగా ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే దాన్ని బయటకు తీసి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పీతపై నరసింహస్వామి ముఖ గుర్తులు కన్పించటంతో చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు. ఇలాంటి పీతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ కృష్ణ చెప్తున్నారు.

విషయం ఆ నోట ఈ నోట గ్రామం మెుత్తం పాకడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫొటోలు తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులకు పంపించుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. తమ గ్రామంలో జరిగిన వింత చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు. పీతను చూసేందుకు వచ్చిన వారంతా ఇలాంటి దాన్ని తాము కూడా ఇంతవరకు చూడలేదంటూ చెప్పుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి