AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: గంజాయికి బానిసైన కొడుకు.. మాన్పించేందుకు తండ్రి మాస్టర్‌ ప్లాన్.. ఏం చేశాడో తెలిస్తే..

1972 నంబర్ కి ఒక తండ్రి ఫోన్ చేశాడు.. తన కొడుకు గంజాయికి అలవాటు పడిన విషయాన్ని వివరంగా చెప్పాడు. ఎలాగైనా తన కొడుక్కి ఆ అలవాటు మాన్పించాలని పోలీసులకు పదేపదే విన్నవించాడు. దీంతో రంగంలోకి దిగి. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు సంచలన విషయాలు తెలసుకున్నారు.

Andhra News: గంజాయికి బానిసైన కొడుకు.. మాన్పించేందుకు తండ్రి మాస్టర్‌ ప్లాన్.. ఏం చేశాడో తెలిస్తే..
Andra News
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 07, 2025 | 6:30 AM

Share

తన కుమారుడుతు గంజాయికి అలవాటు పడ్డాడని ఒక తండ్రి ఫిర్యాదుతో అతనిపై నిఘా పెట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. నగరంతో భారీ ఎత్తున గంజాయి విక్రయం జరుగుతున్న పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం బేతపూడికి చెందిన చందు, పెదవడ్లపూడికి చెందిన ఆనంద్ అలియాస్ బొజ్జా అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. దీంతో విశాఖలోని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి కేజీ గంజాయి ఐదు వేల కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేశారు. ఇలా తయారు చేసిన ఒక్కో ప్యాకెట్ ను రూ. 500 విక్రయించడం స్టార్ట్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ గంజాయి ప్యాకెట్లతో పాటు సిగరెట్లు విక్రయించడం స్టార్ట్ చేశారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను వాడుకొని.. ఆలా విద్యార్ధులను ఆకర్షిస్తున్నారు.

ఇలా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని తెలుసుకున్నారు. మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం సమీపంలో ఉంటూ అక్కడకు వచ్చే యువకులను, విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి సిగరెట్లు విక్రయించడం చేస్తున్నారు. ఓ తండ్రి ఫిర్యాదుతో అతనిపై కుమారుడిపై నిఘా పెట్టిన పోలీసులు నగరంలో జరుగుతున్న ఈ చీకటి దందాను గుర్తించారు. దీంతో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న చందు, బొజ్జాలకు తో పాటు మంగళగిరి బాపిస్టు పేటకు చెందిన బుల్లా రవి, ఆత్మకూరుకు చెందిన తేజ, చైతన్య, లక్ష్మణరావు అనే నిందితులను అరెస్ట్ చేశారు.

అయితే తనకు కుమారుడు గంజాయికి అలవాటు పడ్డాడని ఒకతండ్రి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇంత పెద్ద ముఠాను పట్టుకోగలిగామని మంగళగిరి పోలీసులు తెలిపారు. తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే వారిపై నిఘా ఉంచి పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో చిక్కుకోక ముందే తల్లిదండ్రులు అలెర్ట్ అవ్వాలని సలహా ఇస్తున్నారు. సమాజంలో విద్యార్ధులు మంచి పౌరులుగా తయారు కావాలంటే తల్లిదండ్రులు వారిపై కచ్చితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.