మనుషుల్లాగే పశువులకు హాస్టల్.. ఆవులు, గేదెలకు సకల సౌకర్యాలు.. ఎక్కడంటే?
పశువుల హాస్టల్. ఈ పేరు ఎక్కడైనా విన్నారా.. అసలు అది సాధ్యమేనా..! సాధారణంగా హాస్టల్ అంటే గుర్తుకు వచ్చేది విద్యార్థులు, ఉద్యోగులు. అలాంటిది పశువుల హాస్టల్ ఎక్కడుంది. అసలు అది ఎలా నడుస్తుంది. ఆసక్తికరంగా ఉన్న.. ఇది నిజం. పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడంతోపాటు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పశువుల హాస్టల్. ఈ పేరు ఎక్కడైనా విన్నారా.. అసలు అది సాధ్యమేనా..! సాధారణంగా హాస్టల్ అంటే గుర్తుకు వచ్చేది విద్యార్థులు, ఉద్యోగులు. అలాంటిది పశువుల హాస్టల్ ఎక్కడుంది. అసలు అది ఎలా నడుస్తుంది. ఆసక్తికరంగా ఉన్న.. ఇది నిజం. ఎలా అంటే..!
గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడంతోపాటు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక పశువుల హాస్టల్ నిర్మించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో నియోజకర్గానికి ఒక పశువుల హాస్టల్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఒక్కొక్క వసతి గృహానికి 10 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. పశు పోషణ, రక్షణకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట 30 వరకు పశువులను పెంచేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నీరు, పశుగ్రాసంతో పాటు పాలు పితికే యంత్రాలు, గడ్డి కోసే మిషన్లు అక్కడ అందుబాటులోఉంటాయి. అత్యవసర పరిస్థితిలలో బయటకు వెళ్లిన రైతుల పశువులతో పాటు రహదారులపై తిరిగే పశువులకు ఇక్కడ వసతి కల్పించనున్నారు. పశువుల వసతి గృహాల నిర్వహణ బాధ్యతను మహిళా రైతు సంఘాలకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. పేడ, నుంచి బయోగ్యాస్, పాల ఉత్పత్తి, సేంద్రియ ఎరువుల తయారీ ద్వారా హాస్టల్స్ కి ఆదాయాన్ని తీసుకువస్తారు.
కాగా, తడకనపల్లె గ్రామంలో ఈ పశువుల హాస్టల్ సక్సెస్ కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పశువుల హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా వినూత్న ఉరవడికి శ్రీకారం చుట్టడమే అవుతుంది. ఇంటి దగ్గర స్థలం లేని వారికి, పరిశుభ్రంగా ఉంచుకోలేని వారికి, ఎక్కువ శ్రమ తీసుకోలేని వారికి, సరిపడా నీరు అందుబాటులో లేని వారికి, పాడి ద్వారా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పశువుల హాస్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
