Vizianagaram Hospital: విజయనగరం ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు వివాదం.. ఏపీ సర్కార్ వివరణ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో పేర్లు మార్పు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఏదో ఒక విషయం వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల ప్రభుత్వం విజయవాడలోని

Vizianagaram Hospital: విజయనగరం ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు వివాదం.. ఏపీ సర్కార్ వివరణ ఇదే..
Vizianagaram Hospital
Follow us

|

Updated on: Oct 08, 2022 | 6:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో పేర్ల మార్పు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఏదో ఒక విషయం వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పలు ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు పేర్లు మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కొనసాగుతోంది. తాజాగా విజయనగరం ఆసుపత్రి పేరు మార్చినట్లు పలువురు నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా ఆసుపత్రి.. మహారాజా ఆస్పత్రి పేరును.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చినట్లు మీడియాలో కథనాలు రావడంతోపాటు, వార్తలు సైతం ప్రచురితమయ్యాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ట్విట్టర్‌లో విమర్శలు వ్యక్తంచేశారు. ఆసుపత్రి పేరు ఫొటోలను షేర్‌ చేస్తూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. దీనికి సంబంధించి.. ఆసుపత్రి పాత.. కొత్త బోర్డులను షేర్‌ చేశారు.

కాగా.. దీనిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆధారాలతో స్పందించింది. విజయనగరం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పేరు మార్పుపై వస్తున్న వార్తలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ వెల్లడించింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్‌ చెక్‌ ఖాతాలో దీనికి సంబంధించిన అంశాలను పోస్ట్‌ చేయడంతోపాటు వివరణ ఇచ్చింది. ప్రభుత్వంపై నిర్మించిన ఈ ఆసుపత్రి అధికారిక పేరుపై ట్విట్‌ చేసింది. భూమి రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వం ప్రకారం. 1983లో ఈ ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుంచి “గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయనగరం”గా రికార్డులు ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

పునాది రాళ్లు & జీవోలలో ఎక్కడా ‘మహారాజా’ పేరు లేదని తెలిపింది. ఇటీవల, ప్రభుత్వం ఆసుపత్రికి సుమారు రూ.3 కోట్లు పెట్టి మరమ్మతులు చేసింది. ఈ క్రమంలో ఆసుపత్రికి అసలు పేరు పెట్టినట్లు వెల్లడించింది. ఈ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా మార్చాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..