AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru: ఇంత వైల్డ్‌గా ఉన్నావేంట్రా.. భార్య పుట్టింటికి రావటం లేదని ఏకంగా..

భార్య - భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది.

Eluru: ఇంత వైల్డ్‌గా ఉన్నావేంట్రా.. భార్య పుట్టింటికి రావటం లేదని ఏకంగా..
Crime News
B Ravi Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 29, 2025 | 8:46 AM

Share

ఏలూరు: భార్య – భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది. గేదెల మకాంలో గేదెల మొండాలు వేరు వేరుగా పడివుండటం ఏలూరు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఏడాది జూన్ 26న జరిగిన ఘటన అప్పట్లో అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఇంతటి కిరాతకానికి ఎవరు పాల్పడి ఉంటారు. క్షుద్ర పూజల కోసం ఎవరైనా ఇలాంటి పని చేసి ఉంటారా అనే భయం ఆ ప్రాంత ప్రజల్లో కనిపించింది. కట్ చేస్తే, 5 నెలల తరువాత పోలీసులకు అసలు నిందితుడు దొరికాడు. నిందితుడు.. విచారణలో వెల్లడించిన నిజం విని పోలీసులే నివ్వెరపోయారు.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మటం గూడెంలో అత్యంత కిరాతకంగా.. మూడు గేదెలు తలలను నరికారు.. జూన్ 26 , 2025 న తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడిగా దాసరి రంగారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు కు చెందిన రంగారావు లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. అతనికి తన భర్య సౌజన్యతో గొడవలు వచ్చాయి. దీంతో సౌజన్య తనభర్త రంగారావును వదిలి మటంగూడెం లోని తన బంధువుల ఇంటికి చేరుకుంది.

భర్తకు దూరమైన ఆమెను బంధువులు చేరదీసి ఆదరించారు. అయితే తన భర్య తనవద్దకు రాకపోవటానికి కారణం ఆమె బంధువులే అని నమ్మి వారిని భయబ్రాంతులకు గురిచేయడం, ఆర్థికంగా నష్ట పరచాలన్న ఉద్దేశంతో గేదెల తలలు నరికి వాటిని చంపేశాడు. ఇక లారీ డ్రైవర్ కావటంతో ఫోన్ వాడకుండా మహారాష్ట్రకు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అయితే బాధితుడు తొర్లపాటి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రంగారావును పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

ప్రాణం తీయటం తేలిక.. పోయటం చాలాకష్టం అంటారు. చిన్న చిన్న కారణాలతోనే దంపతుల మధ్య గొడవలు జరుగడం.. దీన్ని సాకుగా తీసుకుని కొందరు కన్నబిడ్డలతో సహా ఆత్మహత్యలకు పాల్పడటం లేదా చంపడం.. లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఈ ఘటనల్లో అభంశుభంతెలియని చిన్నారులు .. కాల్మషం లేని పశువులు సైతం బలవుతున్న తీరు ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..
తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..
వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలి
వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలి
భారత్-రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదుః పుతిన్
భారత్-రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదుః పుతిన్
ఏసీబీ గాలంకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం..!
ఏసీబీ గాలంకి చిక్కిన రూ.100 కోట్ల అవినీతి తిమింగలం..!
ఆధార్-పాన్ ఇలా లింక్ చేశారా..? మీకో అలర్ట్.. అలా చేసి ఉంటే..
ఆధార్-పాన్ ఇలా లింక్ చేశారా..? మీకో అలర్ట్.. అలా చేసి ఉంటే..
కళ్యాణ్, డీమాన్ ఛీటింగ్ బాగోతం బయటపెట్టిన భరణి..
కళ్యాణ్, డీమాన్ ఛీటింగ్ బాగోతం బయటపెట్టిన భరణి..
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వైజాగ్ గడ్డపై టీమిండియా రికార్డులు.. సిరీస్ పోరులో గెలిచేదెవరంటే?
వైజాగ్ గడ్డపై టీమిండియా రికార్డులు.. సిరీస్ పోరులో గెలిచేదెవరంటే?