AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

ఏపీలో పెన్షన్లు తీసుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్త అనే చెప్పాలి. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మరికొన్ని సూచనలు చేసింది. అవెంటో తెలుసుకుందాం పదండి...

AP News: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
Andhra Pensions
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2024 | 10:44 AM

Share

ఆంధ్రాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించింది. గత పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా కంప్లైంటులు వచ్చాయని గుర్తు చేసిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా పాటించాలని సూచించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని.. కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. గతంలో మాదిరి గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో.. పెన్షన్లు పొందేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు పేర్కొంది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి స్పష్టం చేసింది. పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని పేర్కొంది. పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వడానికి..   వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.

ప్రజంట్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. మే తొలి వారంలొ 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. ఎండలు, వడగాలులు, ఉక్కపోత కారణంతా జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. ఈ ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు..  రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవడమంటే ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలోనే సకాలంలో డబ్బు రెడీగా ఉంచుకోవడంతో పాటు, లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే.. వారంతా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…