AP News: బ్రాందీ కొనే స్థోమత లేదు.. అందుకే పాము విషం తాగుతున్నాడు.. అంతేకాదు..

పాములను పట్టుకున్న తర్వాత విషాన్ని పిండి సేవిస్తుంటాడు ఇతను. అది తనకు మత్తు వస్తుందట. తనకు మాత్రం ఒళ్లంతా విషమే అంటున్నాడు వెంకటేశ్వర్లు. పాము కనిపిస్తే చాలు విషం పిండుకోవడం, తాగడం తనకు అలవాటు అంటున్నాడు. ఇతడిని స్థానికంగా అందరూ పున్నమి నాగు అని పిలుస్తుంటారు. పూర్తి వివరాలు ఇలా....

AP News: బ్రాందీ కొనే స్థోమత లేదు.. అందుకే పాము విషం తాగుతున్నాడు.. అంతేకాదు..
Snake Man Venkateswarlu
Follow us

|

Updated on: Apr 27, 2024 | 11:47 AM

పామును చూస్తేనే కొందరు సుస్సు పోసుకుంటారు.  కిలోమీటరు దూరం పరిగెత్తుతారు. అయితే ఈ వ్యక్తికి మాత్రం పాము దొరికితే పండగే. దానితో ఎంచక్కా ఆడుకుంటాడు. అంతేకాదు.. పాము విషాన్ని కూడా ఇష్టంగా తాగేస్తాడు. అయినా కానీ అతనికి ఏం కాదు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో పాటు ఉగ్గు విషం ఇచ్చి పెంచారు. అతని పేరు వెంకటేశ్వర్లు. ఊరు… ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం. పాము కనిపిస్తే చాలు.. కూల్‌డ్రింక్ తాగినంత ఈజీగా.. పాము విషాన్ని జుర్రేస్తున్నాడు. తన తండ్రికి ఈ అలవాటు ఉండేదని.. ఆయన నుంచి తనకు అబ్బినట్లు వెంకటేశ్వర్లు చెబుతున్నాడు. బ్రాందీ కొని తాగే స్థోమత తనకు లేదని.. అందుకే మత్తు కోసం పాము విషాన్ని తీసుకుంటానని ఈయన చెబుతున్నాడు. పాము విషం తీసుకుంటే.. తనకు మత్తుగా ఉంటుందంటున్నాడు.

ఎంతటి విషసర్పాలతోనైనా చిన్న పిల్లాడి మాదిరి ఆడుకుంటాడు వెంకటేశ్వర్లు.  నాగుపాములను సైతం మెడలో వేసుకుని.. అలా ఊర్లో తిరుగుతూ ఉంటాడు. స్థానికులు ఈయన్ని పున్నమి నాగు అని పిలుస్తుంటారు. అయితే తనకు ఒళ్లంతా విషం ఉండటం వల్ల.. జనాలు కాస్త దూరంగా ఉంటారని చెబుతున్నాడు వెంకటేశ్వర్లు. తనకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వాళ్లకు ఈ అలవాటు నేర్పలేదని వెల్లడించాడు. ఒకసారి కోడిని కొరికితే తనకున్న విషం కారణంగా అది చనిపోయిందట. అలాగే కుక్క చెవి కొరికితే.. అది కూడా చనిపోయిందని అంటున్నాడు వెంకటేశ్వర్లు. తన జీవితంలో వేల కొద్దీ పాములు పట్టినట్లు చెబుతున్నాడు. పాముకు 6 బొట్ల వరకు విషం ఉంటుందని.. రోజుకో బొట్టు తీసుకుంటానని.. చెబుతున్నాడు.

కడుపులో ఎటువంటి గాయాలు లేనంత వరకు పాము విషం తాగినా ఏం కాదంటున్నారు జన విజ్ఞాన వేదిక వాళ్లు. కడుపులో ఏవైనా గాయాలు ఉంటే మాత్రం ఉంటే మాత్రం అతనికి పాయిజన్ ఎక్కి.. ప్రాణం పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…