YCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే అజెండాతో మేనిఫెస్టోః జగన్

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేయడం జరిగిందన్నారు జగన్.

YCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే అజెండాతో మేనిఫెస్టోః జగన్
Ycp Manifesto Ys Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 27, 2024 | 2:00 PM

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేయడం జరిగిందన్నారు జగన్. మేనిఫెస్టోను పవిత్ర బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నామన్నారు. ఇతర పార్టీల్లాగా అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కాని పథకాలకు తమ మేనిఫెస్టోలో చోటు లేదన్నారు జగన్. అక్కాచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతులకు, కార్మికులు, యువత, విద్యార్థులకు మేనిఫెస్టోలో సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు.

ఉన్న పథకాలకు కొనసాగిస్తూ ఇచ్చే నిధుల పెంచుతూ, సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధులను పెంచారు. అలాగే యువతకి ఉపాధి అవకాశాలపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. అమలు చేయలేని హామీలిచ్చి ఆపేసేకంటే.. చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే అజెండాతో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముకాకుండా అన్ని వర్గాలు అదరించేలా మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలను సైతం అమలు చేస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. గతంలో ఉన్న రుణమాఫీ, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతీ నగరంలోనూ హైటెక్‌ సిటీ లాంటివి సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీసుకువస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలని సీఎం జగన్ అన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

రెండు పేజీల మేనిఫెస్టోను ఆవిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి

– ఉన్న పథకాలకు కొనసాగిస్తూ ఇచ్చే నిధుల పెంపు

– భారీ హామీలు కాకుండా.. చేసేదే చెప్తామనేలా మేనిఫెస్టో

– సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేసేలా రూపకల్పన

– అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపు

– యువతకి ఉపాధి అవకాశాలపైనా ప్రత్యేక ఫోకస్

– రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు

– అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు

– వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు

– అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు.

– వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ

– వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంపు

– నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు

– వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం

– వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కొనసాగింపు

– అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

– నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు

– వైస్సార్‌ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు

– మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత

– వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం

– ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు

– వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం

– లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా

– చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు

– వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు

– లా నేస్తం కొనసాగింపు

– అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

– నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌

– ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ

– స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు

– ఉద్యోగులకు వైసిపి మ్యానిఫెస్టోలో కీలక హామీని ప్రకటించిన సిఎం జగన్.

– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా స్కీం కింద తీసుకున్న రుణంపై వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది.

– ప్రభుత్వంలో పని చేస్తున్న 25 వేళ లోపు జీతం తీసుకుంటున్న అప్కాస్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయిన 350000 అన్ని పథకాలు వర్తింపు.

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఇదే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…