AP Election: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీదే సర్కార్.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్!

ఉత్తరాంధ్రలోనే హాట్ సీట్ గా ఉన్న చీపురుపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశం పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అందుకు ఆ నియోజకవర్గంలో తలపండిన ఇద్దరు రాజకీయ యోధులు తలపడటం ఒక కారణం కాగా మరో కారణం ఇప్పుడు తీవ్ర చర్చకు తెర లేపింది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ తెరమీదకు రావడంతో చీపురుపల్లిలో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి.

AP Election: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీదే సర్కార్.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్!
Kala Venkatrao Botsa Satyanarayana
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 27, 2024 | 1:06 PM

ఉత్తరాంధ్రలోనే హాట్ సీట్ గా ఉన్న చీపురుపల్లిలో ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశం పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అందుకు ఆ నియోజకవర్గంలో తలపండిన ఇద్దరు రాజకీయ యోధులు తలపడటం ఒక కారణం కాగా మరో కారణం ఇప్పుడు తీవ్ర చర్చకు తెర లేపింది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ తెరమీదకు రావడంతో చీపురుపల్లిలో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి.

సుమారు ఐదు దశాబ్దాలుగా ఒక్కసారి మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సవాలుగా మారిన ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ కొనసాగితే అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ నియోజకవర్గంలో 1972లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి రైతు పైడప్పనాయుడు గెలుపొందగా, ఆ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ (ఐ)నుండి చిగిలిపల్లి శ్యామలరావు పోటీ చేసి గెలుపొందగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుండి 1999 ఎన్నికల వరకు వరుసగా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, 1989 మినహా వరుసగా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. 1983లో త్రిపుర వెంకటరత్నం, 1985 లో కెంబూరి రామ్మోహనరావు, 1989 లో టంకాల సరస్వతమ్మ, 1994, 1999 లో గద్దె బాబురావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 మినహా ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది.

ఆ తర్వాత జరిగిన 2004లో ఇక్కడ కాంగ్రెస్ నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేసి గెలుపొందగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వ ఏర్పాటు చేసింది. 2014లో టీడీపీ నుండి కిమిడి మృణాళిని గెలుపొందగా, ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇలా వరుసగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇక్కడ అభ్యర్థులు ఏ పార్టీ నుండి గెలుపొందితే, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సెంటిమెంట్ గా వస్తుంది. దీంతో ప్రస్తుతం వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేయగా, టీడీపీ నుండి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు బరిలో ఉన్నాడు. దీంతో ఇరువురి అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు? పాత సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగితే అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అనే అంశం ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..