Andhra Pradesh: మద్యం మత్తులో చోరీకి వెళ్లిన దొంగలు.. ఇంట్లో బంధించి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..

నలుగురు దొంగలు ఫుల్ గా మద్యం సేవించి అటుగా వెళ్తూ తాళం వేసిన రహంతుల్లా ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లో చొరబడ్డారు. లోపల ఉన్న బీరువాను పగలకొట్టగా ఆ శబ్దాలు చుట్టూ పక్కల వాళ్ళు విన్నారు. వెంటనే వెళ్లి చూస్తే అక్కడ నుండి ముగ్గురు దొంగలు పరారి కాగా ఓ దొంగ మాత్రం దొరికి పోయాడు. దీంతో  స్థానికులు ఆ దొంగను ఇంట్లోనే బంధించి దేహశుద్ధి చేశారు.

Andhra Pradesh: మద్యం మత్తులో చోరీకి వెళ్లిన దొంగలు.. ఇంట్లో బంధించి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..
Kurnool District
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Nov 04, 2023 | 1:45 PM

మద్యం మత్తులో ఓ ఇంట్లో చోరికి వెళ్లిన దొంగల ముఠాకు కాలనీ వాసులు చుక్కలు చూపించడంతో, ప్రాణ భయంతో ముగ్గురు దొంగలు పరరయ్యారు. ఓ దొంగ మాత్రం దొరికిపోయాడు. ఆ దొంగను ఇంట్లో బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది..

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్న అచ్చకట్ట వీధిలో ఓ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన నలుగురు దొంగలకు కాలనివాసులు చుక్కలు చూపించారు. గ్రామానికి చెందిన రహంతుల్లా పొలం పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు అంతా కలిసి పొలానికి వెళ్లారు. అయితే నలుగురు దొంగలు ఫుల్ గా మద్యం సేవించి అటుగా వెళ్తూ తాళం వేసిన రహంతుల్లా ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లో చొరబడ్డారు. లోపల ఉన్న బీరువాను పగలకొట్టగా ఆ శబ్దాలు చుట్టూ పక్కల వాళ్ళు విన్నారు.

ఇవి కూడా చదవండి

వెంటనే వెళ్లి చూస్తే అక్కడ నుండి ముగ్గురు దొంగలు పరారి కాగా ఓ దొంగ మాత్రం దొరికి పోయాడు. దీంతో  స్థానికులు ఆ దొంగను ఇంట్లోనే బంధించి దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే రహంతుల్లా ఇంట్లో బీరువాలో పెట్టిన మూడు లక్షల నగదు, మూడు తులాల బంగారు, 20 తులాల వెండి దొంగలు ఎత్తుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..