Potholes Roads: గతుకుల రోడ్డుపై బైక్ మీద వెళ్తూ గర్భిణి మృతి.. మా రోడ్డు మేమే బాగు చేసుకుంటామని స్థానికుల ఫ్లెక్సీల ఏర్పాటు
రోడ్డు మరమ్మత్తులు చేయాలన్న డిమాండ్ స్థానికుల వద్ద నుండి వచ్చింది. అయితే అటు మున్సిఫల్ అధికారులు గాని ఇటు ఆర్ అండ్ బి అధికారుల గాని స్పందించడం లేదు. దీంతో స్థానికంగా ఉండే చింతలపూడి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ చింతలపూడి శ్రీనివాసరావు ద్రుష్టికి ఈ విషయం వచ్చింది. దీంతో ఆయన అధికారులను ఈ నెల ఇరవై తేది నాటికి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లాలో రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పదిహేను రోజుల క్రితం భార్య డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా ఆమె వద్దకు బైక్ పై వెలుతున్న వ్యక్తి రోడుపై గుంతల కారణంగా ప్రమాదానికి గురై చనిపోపోవడం కలకలం రేపింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై వార్తలు వచ్చాయి. కారంపూడి నుండి నకరికల్లు వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. ఈ ఘటన మర్చిపోకముందే పిడుగురాళ్ల పట్టణంలో మా రోడ్డును మేమే బాగు చేసుకంటాం అంటూ ఏర్పాటు చేసిన ప్లెక్స్ మరింత కలకలం స్రుష్టిస్తున్నాయి.
పిడుగురాళ్ల నుండి జానపాడు వెళ్లే రహదారిలో విఘ్నేశ్వర అపార్ట్ మెంట్ వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రోడ్డుపై వెలతున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిందంటే ఇంక అంతే సంగతలు. గుంత ఎక్కడ ఉందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ గుంతల కారణంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణీకులు క్షతగాత్రులు అవుతున్నారు.
ఈ క్రమంలోనే రోడ్డు మరమ్మత్తులు చేయాలన్న డిమాండ్ స్థానికుల వద్ద నుండి వచ్చింది. అయితే అటు మున్సిఫల్ అధికారులు గాని ఇటు ఆర్ అండ్ బి అధికారుల గాని స్పందించడం లేదు. దీంతో స్థానికంగా ఉండే చింతలపూడి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ చింతలపూడి శ్రీనివాసరావు ద్రుష్టికి ఈ విషయం వచ్చింది. దీంతో ఆయన అధికారులను ఈ నెల ఇరవై తేది నాటికి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
ఇందు కోసం ఎక్కడైతే రోడ్డుపై గుంతలున్నాయో అక్కడే ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల ఇరవై నాటికి రోడ్డు వేయాలని ఒక వేళ నాయకులు స్పందించకుంటే మా డబ్బులతో మేమే రోడ్డు వేస్తామని ఆ ఫ్లెక్స్ లో పేర్కోన్నారు. దీంతో వాహనదారులు ఆసక్తిగా ఆ ప్లెక్స్ ను చూస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు వేయాలని చింతలపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జనసేన నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడి పోయిన చింతలపూడి ఆ తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన ప్లెక్స్ ఏర్పాటు చేయడం మరింత ఆసక్తి రేపింది. అయితే అధికారులు స్పందిస్తారో లేక చింతలపూడే రోడ్డు వేస్తారో తెలియాలంటూ మరికొంత కాలం వేచి చూడాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..