మానవత్వం చాటుకున్న డాక్టర్.. కరోనా సోకిన మహిళను భూజాలపై మోసిన వైద్యుడు.. ఎక్కడంటే..

కరోనా వైరస్... ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. తల్లిదండ్రులకు పిల్లలకు.. చిన్నారులకు అమ్మనాన్నలను దూరం చేసి.. ఎన్నో కుటుంబాలను చిధ్రం చేస్తోంది.

మానవత్వం చాటుకున్న డాక్టర్.. కరోనా సోకిన మహిళను భూజాలపై మోసిన వైద్యుడు.. ఎక్కడంటే..
East Godavari
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2021 | 11:17 PM

కరోనా వైరస్… ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. తల్లిదండ్రులకు పిల్లలకు.. చిన్నారులకు అమ్మనాన్నలను దూరం చేసి.. ఎన్నో కుటుంబాలను చిధ్రం చేస్తోంది. కరోనా సోకిన వ్యక్తిని కానీ.. వారి కుటుంబానికి సాయం చేయాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇక తమ ఇంటి పక్క వారికి.. ఆత్మీయులకు కోవిడ్ సోకిన విషయం తెలిస్తే.. సాయం చేయడానికి నిర్మోహమాటంగా ముఖం తిప్పెస్తున్నారు. ఎంతో మంది బాధతో విలవిల్లాడిపోతున్న దగ్గరికి వెళ్లె సహసం చేయలేకపోతున్నారు. కేవలం వైద్యులు, నర్సులు మాత్రమే కరోనా రోగులకు ప్రాణాల పై ఆశ కల్పిస్తూ.. నిరంతరం వారితో కలిసిపోతూ సేవలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా సోకిన ఓ మహిళను… అక్కడి స్థానిక డాక్టర్ తన భుజాలపై మోసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మానవత్వం పరిమళించింది. బి. ఎం. పి . ప్రాక్టీషనర్ ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా రోగిని ముట్టుకోవడానికే కాదు.. కనీసం చూడడానికి కూడా భయపడే ఈ రోజుల్లో ఏకంగా పాజిటివ్‌ వ్యక్తిని తన భుజంపై మోసుకుంటూ ఆస్పత్రికి తరలించాడు ఈ వైద్యుడు. కాకినాడ భవన్నారాయణపురానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుంది. అయితే సడెన్‌గా ఆక్సిజన్ లెవెల్స్‌ పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ సాహసించలేదు. మహిళ దగ్గరికి వెళితే తమకు కరోనా అంటుకుంటుందనే భయంతో అటు వైపు వెళ్లడానికి సాహసించలేదు. ఈ క్రమంలోనే అక్కడి స్థానిక బీఎంపీ డాక్టర్‌ ప్రసాద్‌కు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే అక్కడకు చేరుకున్న డాక్టర్ .. ఆ మహిళ పడుతున్న అవస్థలు చూసి చలించిపోయాడు. వెంటనే మహిళ నివాసం ఉండే అపార్ట్మెంట్ మూడవ అంతస్తు నుండి భుజం మీద ఎత్తుకుని హాస్పిటల్ కు తరలించాడు డాక్టర్ ప్రసాద్‌. కరోనా వచ్చిన మహిళను బంధువులు పట్టించుకోకపోవడంతో బి యమ్ పి ప్రాక్టీషనర్ ప్రసాద్ ధైర్యం చేశాడు. కరోనా మహిళను ప్రసాద్‌ తన భుజంపై మోసుకెళుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రసాద్‌ మానవత్వం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‏లో కఠినంగా లాక్‏డౌన్.. రాత్రి వేళలో చిన్నారిని రక్షించిన పోలీసులు.. ఆ పాప మాటలకు చలించిన ఖాకీలు..

మీ ఇంట్లో ఈ చెట్లు ఉంటే.. ఆరోగ్యంతోపాటు అదృష్టం కూడా మీ సొంతమే.. మొక్కలు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసా..