మోహన్ బాబు మోసం చేశాడు – దాసరి సుశీల

హీరో మోహన్ బాబు ఇవాళ తన స్టూడెంట్స్ తో కలిసి తిరుపతిలో ఫీ- రీఎంబర్స్ మెంట్ విషయంలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మంచు మనోజ్, విష్ణులు కూడా పాల్గొన్నారు. దీనితో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు మోహన్ బాబు ను పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు పై దాసరి నారాయణ రావు పెద్ద కోడలు దాసరి సుశీల మండిపడింది. దాసరి నారాయణ రావు తనకు […]

  • Ravi Kiran
  • Publish Date - 9:02 pm, Fri, 22 March 19
మోహన్ బాబు మోసం చేశాడు - దాసరి సుశీల

హీరో మోహన్ బాబు ఇవాళ తన స్టూడెంట్స్ తో కలిసి తిరుపతిలో ఫీ- రీఎంబర్స్ మెంట్ విషయంలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మంచు మనోజ్, విష్ణులు కూడా పాల్గొన్నారు. దీనితో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు మోహన్ బాబు ను పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు పై దాసరి నారాయణ రావు పెద్ద కోడలు దాసరి సుశీల మండిపడింది.

దాసరి నారాయణ రావు తనకు గురువు అని చెప్పుకునే మోహన్ బాబు తమని మోసం చేశారని ఆరోపించింది. దాసరి చనిపోగానే ఆస్తులు అందరికి సమానంగా పంచుతానని చెప్పిన మోహన్ బాబు ఇంతవరకు ఆ పని చేయలేదని ఆమె అన్నారు. దీని వల్ల తన కొడుకు మాస్టర్ దాసరి రోడ్డున పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాసరి మనవడికే న్యాయం చేయలేని మోహన్ బాబు.. ఫీ-రీ ఎంబర్స్ మెంట్ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. పేదలకు ఉచిత విద్య ముసుగులో ఫీ- రీ ఎంబర్స్ మెంట్ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆమె తెలిపింది. కాగా ఈ వ్యాఖ్యలకు మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.