Andhra: మామూలోడు కాదు సామి.. భార్యను తిట్టాడని.. ఓనర్‌కే ముచ్చెమటలు పట్టించాడు.. వామ్మో ఏకంగా
యజమానిపై కోపం వస్తే ఉద్యోగం వదిలేసి వెళతారు. లేదంటే ఎదురు గొడవకు దిగుతారు.. కానీ తనలా యజమాని కూడా మనస్తాపానికి గురికావాలనుకున్న ఉద్యోగి.. ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. తనలా యజమాని కూడా తీవ్ర మనస్తాపానికి గురికాలన్నది అతని ఉద్దేశం అట.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

ఏలూరు: యజమానిపై కోపం వస్తే ఉద్యోగం వదిలేసి వెళతారు. లేదంటే ఎదురు గొడవకు దిగుతారు.. కానీ తనలా యజమాని కూడా మనస్తాపానికి గురికావాలనుకున్న ఉద్యోగి.. ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. తనలా యజమాని కూడా తీవ్ర మనస్తాపానికి గురికాలన్నది అతని ఉద్దేశం అట.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.. 2025 సెప్టెంబర్ 9 న చింతలపూడిలోని కనక దుర్గా ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. ఈ కంపెనీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని ఖాతాదారులకు లోన్స్ ఇస్తుంది. ఇలా తాకట్టుపెట్టిన బంగారం ఆడిటింగ్ కోసం వచ్చిన వడ్లమూడి ఉమా మహేష్ సిబ్బంది ఏమరపాటుగా ఉన్న సమయంలో నాలుగున్నర కేజీల బంగారాన్ని తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకుని పరారయ్యాడు. అదేరోజు రాత్రి కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటికపుడు వాహనాల తనిఖీలు చేపట్టినా నిందితుడి ఆచూకీ చిక్కలేదు.
అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న మహేష్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. దొంగలించిన మొత్తం బంగారం విలువ రూ 7 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఇందులో కేవలం 6 గ్రాముల ఉంగరాన్ని తన అవసరాలకోసం వాడుకున్నాడు. మిగిలిన సొత్తు మొత్తాన్ని పోలీసులు నిందితుడి నుంచి రికవరీ చేశారు. అయితే మహేష్ అసలు ఈ దొంగతనం ఎందుకు చేసాడని పోలీసులు విచారిస్తే కారణం చాలా విచిత్రంగా ఉంది.
వీడియో
మహేష్ ది సొంత జిల్లా నెల్లూరు అయితే అతని భార్య కూడా ఇతను పని చేస్తున్న కంపెనీలోనే పనిచేస్తుంది. ఆమెను కంపెనీ యజమాని పరుషంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన మహేష్ ఇలా చోరీకి పాల్పడ్డాడు. ఇలా చేయటంతో అతను కూడా టెన్షన్ కు గురికావటంతో పాటు కంపెనీ ఇబ్బదుల పాలు అవుతుందనుకున్నాడు. అయితే ప్రస్తుతం దొంగగా ముద్రపడి జైలుకు వెళ్ళక తప్పలేదు. సుమారు 4 నెలలపాటు ఎవరికి కనీసం ఫోన్స్ లో కూడా అందుబాటులో లేకుండా తప్పించుకు తిరిగిన అతడిని పొలీసు శాఖలో ఐటీ విభాగం ఇచ్చిన క్లూస్ ఆధారంగా పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
