AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌.. లక్ష కుటుంబాలకు లబ్ది..

నేతన్నలకు ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్ తెలిపింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్షకు పైగా నేతన్న కుటుంబాలకు భారీ ఆర్థిక వెసులుబాటు కలగనుంది. అసలు ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది? ఎవరు అర్హులు..? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌.. లక్ష కుటుంబాలకు లబ్ది..
Ap Govt Free Electricity For Weavers
Krishna S
|

Updated on: Jan 29, 2026 | 7:03 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నేతన్నల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అధికారిక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం రెండు విభాగాలుగా విభజించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. తద్వారా అటు చేనేత, ఇటు మరమగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. చేనేత మగ్గాల కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో 93 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. మర మగ్గాలు కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించనున్నారు. దీంతో 10,534 కుటుంబాలకు లబ్ది జరగనుంది.

నేతన్నల జేబుల్లో మిగిలే సొమ్ము ఎంత?

సాధారణంగా ఒక చేనేత కార్మికుడు మగ్గం నేయడానికి వాడే విద్యుత్ ఖర్చు వారిపై పెను భారంగా మారుతోంది. ఈ పథకం ద్వారా సగటున ఒక కుటుంబానికి నెలకు రూ. 720 వరకు విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఏడాదికి సుమారు రూ.8,640 నేతన్నల కుటుంబాలకు ఆదా అవుతుంది. ఈ మిగులు ఆదాయం వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు ఎంతో తోడ్పడనుంది.

హామీలు అమలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల కష్టాలను స్వయంగా చూశారని, అందుకే పాదయాత్రలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా చేనేత కార్మికుల కోసం మరికొన్ని సంక్షేమ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుందని ఆమె గుర్తు చేశారు. చేనేత కార్మికులకు పెన్షన్ వయస్సును 50 ఏళ్లకు తగ్గించడంతో పాటు నెలకు రూ. 4,000 పెన్షన్ అందిస్తూ వారి వృద్ధాప్యానికి భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. వస్త్ర పరిశ్రమలో ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక, విద్యుత్ బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్న నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం ఒక గొప్ప బూస్ట్ అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
గంభీర్, గిల్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ ప్లేయర్
గంభీర్, గిల్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ ప్లేయర్
గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ ఫొటోలతో మెసేజ్.. కట్ చేస్తే..
అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ ఫొటోలతో మెసేజ్.. కట్ చేస్తే..
50 ఏళ్ల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన బ్లాక్ టైగర్.. ఎక్కడంటే..?
50 ఏళ్ల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన బ్లాక్ టైగర్.. ఎక్కడంటే..?