AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతికొచ్చినట్టే వచ్చి.. చాపచుట్టినట్టు నేలకొరిగిన వరి, అరటి, బొప్పాయి.. విరిగిన రైతన్న వెన్ను!

వరిచేలు వెన్నువిరిగింది. చేతికి రావాల్సిన పత్తి గాలికి కొట్టుకుపోయింది. అరటి, బొప్పాయి తోటలు చాపచుట్టినట్టు నేలకొరిగిపోయాయి. కల్లాల్లో పెట్టిన మొక్కజొన్న వరదపాలైంది. మార్కెట్లోకి వెళ్లాల్సిన మిరప పొలాల్లోనే రాలిపోయింది. గద్దొచ్చి పిల్లను ఎత్తుకుపోయినట్టు.. మొంథా పంటనంతా తన్నుకుపోయింది. కోత కోసి కల్లాలకు తరలిద్దామనుకునే లోపే నానాబీభత్సం జరిగిపోయింది. ముఖ్యంగా వరి.. కొన్నిచోట్ల కంకుల దశకు వచ్చాయి. కొన్నిచోట్ల పాలుపోసుకుంటున్నాయి. ఆ పంటంతా వరదల్లో తేలియాడుతుంటూ రైతుల కళ్లలో కన్నీటి ధారలు పారుతున్నాయి.

చేతికొచ్చినట్టే వచ్చి.. చాపచుట్టినట్టు నేలకొరిగిన వరి, అరటి, బొప్పాయి.. విరిగిన రైతన్న వెన్ను!
Cyclone Montha Devastates Crops
Balaraju Goud
|

Updated on: Oct 29, 2025 | 10:11 PM

Share

మొంథా.. దీని తీవ్రతెంతో తెలియక తీరం దాటే దాకా వణుకు పుట్టించింది. తీరా తీరం దాటాక రైతు ఎక్కడెక్కడ ఉన్నాడో పట్టి మరీ ముంచుతోంది. ప్రాణనష్టం తప్పించగలిగాం అని గుండెల మీద చేయి వేసుకున్నారోలేదో.. పంటకు అపారనష్టం తెచ్చిపెట్టి రైతు గుండె పగలిపోయేలా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పంటనష్టం ఎంత అంటే.. ఇప్పటికైతే ‘అపారం’ అనే సమాధానమే వస్తోంది. చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకుంటే ఎంత కష్టమో.. అలా కుమిలిపోతున్నాడు రైతు. అమ్ముకుని అప్పు తీర్చొచ్చు అనుకునే సమయానికి మొత్తానికే తుడిచి పెట్టేసింది మొంథా. సముద్రపు పోటు ఎగదన్నుతుండడంతో చెరువుల్లోని రొయ్యలను కౌంట్ వేయకుండానే అమ్ముకుంటున్నాడు ఆక్వారైతు. ఏపీ, తెలంగాణలో ఏ రైతును కదిపినా కన్నీటిధారలే కనిపిస్తున్నాయి. సో, మొంథా మిగిల్చిన నష్టమెంత? వరిచేలు వెన్ను విరిగింది. చేతికి రావాల్సిన పత్తి గాలికి కొట్టుకుపోయింది. అరటి, బొప్పాయి తోటలు చాపచుట్టినట్టు నేలకొరిగిపోయాయి. కల్లాల్లో పెట్టిన మొక్కజొన్న వరదపాలైంది. మార్కెట్లోకి వెళ్లాల్సిన మిరప పొలాల్లోనే రాలిపోయింది. గద్దొచ్చి పిల్లను ఎత్తుకుపోయినట్టు.. మొంథా పంటనంతా తన్నుకుపోయింది. కోత కోసి కల్లాలకు తరలిద్దామనుకునే లోపే నానాబీభత్సం జరిగిపోయింది. ముఖ్యంగా వరి.. కొన్నిచోట్ల కంకుల దశకు వచ్చాయి. కొన్నిచోట్ల పాలుపోసుకుంటున్నాయి. ఆ పంటంతా వరదల్లో తేలియాడుతుంటూ రైతుల కళ్లలో కన్నీటి ధారలు పారుతున్నాయి. గట్టెమ్మటి వెళ్తున్న రైతును చూసి వరిచేను కన్నీరుపెడుతోంది.. ఈ సీజన్‌లోనైనా అన్నదాత కష్టాలు తీర్చలేకపోయానే అని. పగిలిన పత్తికాయలు బోరుమంటున్నాయి.. రైతును ఈసారైనా ఆదుకోలేకపోయామే అని. గుండెలు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి