Weather Report: తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్…
మొంథా ముంచెత్తుతోంది...! రెండ్రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి తెలుగు రాష్ట్రాల్లోని వాగులు-వంకలు పొంగిపొర్లుతున్నాయి. టూ స్టేట్స్‌ను టార్గెట్ చేసింది మొంథా తుఫాన్. గ్యాప్ అన్నదే లేకుండా నాన్-స్టాప్‌గా వర్షం కురుస్తుండటంతో వాగులు,వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం....

మంగళవారం రాత్రి ఏపీలో నరసాపురం దగ్గర తీరం దాటినా మొంథా తుఫాన్ శాంతించలేదు. అది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినా, ఇంక నష్టాన్ని కలగజేస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలతో ఏపీని వణికిస్తోంది. దాని ధాటితో ఏపీలో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఏయే జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉందో తెలుసుకుందాం..
ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి…తెలంగాణ వైపు దూసుకొచ్చింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
గురువారం హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
సూర్యాపేట, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కొమురం భీమ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
