AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan kalyan: ఆ పనులు వెంటనే స్టార్ట్ చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు.

Pawan kalyan: ఆ పనులు వెంటనే స్టార్ట్ చేయండి.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
Ap Deputy Cm Pawan Kalyan
Anand T
|

Updated on: Oct 29, 2025 | 9:52 PM

Share

మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు. 1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తాగు నీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం మార్గాలు అన్వేషించాలని. ఈ చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలని.. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వాన నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని. నీరు ఎక్కడ కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ క్రమంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయని.. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. మూడు, నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించాలని.. మళ్ళీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదని.. దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి పవన్ కల్యాన్ అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.