AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: ఎటు చూసిన జల విధ్వంసమే.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. నీటమునిగిన ఊళ్ళు

బాపట్ల దగ్గర తుఫాన్‌ తీరం దాటింది.కానీ మిచౌంగ్‌ విధ్వంసం ఇంకా కొనసాగుతోనే ఉంది.ఎడదెరిపిలేని వానలతో వరద పోటెత్తుతోంది. చేతికొచ్చిన పంట నీట తుడిచిపెట్టుకుపోయి రైతులు కన్నటిపర్యంతం అవుతున్నారు. ఎటు చూడు జలవిలయమే. పంటలన్నీ వరద పాలయ్యాయి. మిచౌంగ్‌ ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

Cyclone Michaung: ఎటు చూసిన జల విధ్వంసమే.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. నీటమునిగిన ఊళ్ళు
Cyclone Michaung
Balaraju Goud
|

Updated on: Dec 06, 2023 | 7:51 AM

Share

మిన్ను విరిగి మీద పడ్డట్టుగా మిచౌంగ్‌ తుఫాన్‌ పచ్చని పంటలపై విరుచుకపడింది. ఎటు చూసిన జల విధ్వంసమే.. కాలనీలు చెరువులను తలపించాయి. వాగులు వంకలు పొంగి ఇళ్లలోకి వరద చొచ్చుకు వచ్చింది. ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంల్లో విలవిల్లాడాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోఆయి. వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. అపార నష్టం, ఎంత కష్టం, తుఫాన్‌ తీరం దాటింది. కానీ రైతన్న కళ్లలో ఇంకా ఆవేదన సుడులు తిరుగుతూనే ఉంది. మాయదారి వాన దంచి కొడుతోంది.మరో రెండు రోజుల పాటు జలవిలయమే

బాపట్ల దగ్గర తుఫాన్‌ తీరం దాటింది.కానీ మిచౌంగ్‌ విధ్వంసం ఇంకా కొనసాగుతోనే ఉంది.ఎడదెరిపిలేని వానలతో వరద పోటెత్తుతోంది. చేతికొచ్చిన పంట నీట తుడిచిపెట్టుకుపోయి రైతులు కన్నటిపర్యంతం అవుతున్నారు. ఎటు చూడు జలవిలయమే. పంటలన్నీ వరద పాలయ్యాయి. మిచౌంగ్‌ ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

తుఫాన్‌ తీరాన్ని తాకిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. సముద్రంలో 2మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి.

ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాళ్లోతు వరద నీరు వచ్చి చేరింది. ఇక వరద ధాటికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఊహించనివిధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమైంది.. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు.

ఎన్టీఆర్‌ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బాపట్ల, తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు 11 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరో రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో కూడా తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మత్స్యాకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాన్‌ ధాటికి పంటలు చిన్నాభిన్నమై రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…