Cyclone Michaung: ఏలూరులో టోర్నడో బీభత్సం.. వైరల్ అవుతోన్న వీడియో..
సాధారణంగా టోర్నడోలు అనగానే మనం ఎక్కువగా విదేశాల్లో సంభవించేవాటినే చూస్తుంటాం. ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి టోర్నడోలు సంభవిస్తుంటాయి. అయితే తాజాగా మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలూరులో టోర్నడో బీభత్సాన్ని సృష్టిచింది. సాధారణంగా.. మైదాన ప్రాంతాలలో సంభవించే 'టోర్నడో లు' గురించి వినడమే గాని, ఎన్నడూ చూడలేదు. అప్పుడప్పుడూ కొల్లేరు ప్రాంతంలో చిన్నపాటి..

ఒక వైపు తీవ్రమైన తుఫాన్, ఆ తుఫాన్ కు టోర్నడో తోడైతే ఆ విధ్వంసాన్ని ఊహించడానిడే భయం వేస్తుంది. అటువంటి ప్రకృతి ప్రకోపాన్ని స్వయంగా చూసిన కొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడగడా వనికి పోయారు. భారీ చెట్లు, ఇళ్ళు, వాహనాలు, ఎది అడ్డొస్తే దానిని తనలో కలుపుకుని టోర్నడో విద్వంసం సృష్టించింది.
సాధారణంగా టోర్నడోలు అనగానే మనం ఎక్కువగా విదేశాల్లో సంభవించేవాటినే చూస్తుంటాం. ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి టోర్నడోలు సంభవిస్తుంటాయి. అయితే తాజాగా మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలూరులో టోర్నడో బీభత్సాన్ని సృష్టిచింది. సాధారణంగా.. మైదాన ప్రాంతాలలో సంభవించే ‘టోర్నడో లు’ గురించి వినడమే గాని, ఎన్నడూ చూడలేదు. అప్పుడప్పుడూ కొల్లేరు ప్రాంతంలో చిన్నపాటి సుడిగుండాలు చిన్నపాటి టోర్నడో లా వస్తుంటాయి.
వీటివల్ల ఎప్పుడూ పెద్ద ప్రమాదం సంభవించలేదు. కానీ ఈసారి వచ్చిన టోర్నడో రూపంలోని ప్రకృతి విన్యాసం చూసి భయాందోళనతో వణికిపోయారు ప్రజలు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులతో బిక్కుబిక్కుమంటున్న జనానికి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో వింత అనుభవం ఎదురైంది. జాతీయ రహదారి 165 కు సమీపంలో వరి పొలాలలో ప్రారంభమైన సుడిగుండం ( టోర్నడో) వాయువేగంతో సుడులు తిరుగుతూ సుమారు రెండున్నర కిలోమీటర్లు బీభత్సం సృష్టించింది.
వీరవాసరం, వడ్డిగూడెం, తోలేరు గ్రామాలలో భీభత్సం సృష్టించింది. ఈ టోర్నడో దెబ్బకు భారీ చెట్లు, చెరువుల లోని నీరు, మూడు ట్రాక్టర్లు, వరి కోత మిషన్, లారీ పైకిఎగిరి పడ్డాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక కక్కా- ముక్కా రెస్టారెంట్, ఒక రైస్ మిల్లు ధ్వంసమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కక్కా- ముక్కా రెస్టారెంట్ పైన రేకులు ఫర్నిచర్, వంట సామాగ్రి ధ్వంసం అయ్యాయి. వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుడిగాలి బీభత్యానికి వీరవాసరం మండలం తోలేరులో తాటాకిళ్లు కూలడంతో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.వారిని భీమవరం లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెరువు గట్టున ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎగిరి చెరువులో పడింది. వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
