AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫిక్ట్.. ఏపీలో బియ్యం ధరలకు రెక్కలు.. జనం జేబులకు చిల్లులు

ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.56 వరకు ఉంటోంది. మిల్లర్ల నుంచి హెల్‌సేల్ వ్యాపారులకు వచ్చే బియ్యంపై కిలోకు రూ.3 నుంచి రూ.5 రుపాయల వరకు లాభం కలుపుకుని విక్రయిస్తుంటారు. మూడు నెలల క్రితం రూ.1250-1300 ఉన్న 26కేజీల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.1,600కు చేరువలో ఉంది. కిలో బియ్యం ధర రూ.60కు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫిక్ట్.. ఏపీలో బియ్యం ధరలకు రెక్కలు.. జనం జేబులకు చిల్లులు
Rice Price Hike
M Sivakumar
| Edited By: |

Updated on: Dec 07, 2023 | 11:56 AM

Share

మిచౌంగ్ తుఫాను తీరం దాటగానే నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న వ్యాపారులు, తుఫాను ప్రభావం అంచనా కూడా రాక ముందే బియ్యం ధరలు పెంచేశారు. ధరలు పెంచుతున్నట్లు మిల్లర్ల నుంచి టోకు వ్యాపారులకు సమాచారం అందింది. ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కొరవడటంతో గత కొద్ది నెలలుగా బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.

గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. పులిమీద పుట్రలా తుఫాను దెబ్బకు పండిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు తుఫాను ప్రభావంతో బియ్యం ధరలు మరింత పెరుగనున్నాయి..

ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.56 వరకు ఉంటోంది. మిల్లర్ల నుంచి హెల్‌సేల్ వ్యాపారులకు వచ్చే బియ్యంపై కిలోకు రూ.3 నుంచి రూ.5 రుపాయల వరకు లాభం కలుపుకుని విక్రయిస్తుంటారు. మూడు నెలల క్రితం రూ.1250-1300 ఉన్న 26కేజీల బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.1,600కు చేరువలో ఉంది. కిలో బియ్యం ధర రూ.60కు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కనీస ధర రూ.1500 ఉంటుందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కాస్త తక్కువ రకం కొత్త బియ్యం ధరలు కూడా 26 కిలోల బస్తా రూ.1400 కంటే తక్కువకు దొరికే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మార్కెట్‌లో సరిపడా నిల్వలు మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. బియ్యం ధరలు భారీగా పెంచడం ద్వారా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం సేకరించే బియ్యం ధరలు, పౌర సరఫరాల ద్వారా అందించే బియ్యం ధర అన్ని ఖర్చులతో కలిపి రేషన్ కార్డుల ద్వారా లబ్దిదారుడికి చేరే సమయానికి రూ.39 ఖర్చు అవుతోంది. ఇందులో ధాన్యం సేకరణ ధరతో పాటు గన్నీ బ్యాగులు, రవాణాలు, రేషన్ దుకాణాల కమిషన్‌, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యంలో కేంద్రం వాటా కూడా ఉంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..