Corona In AP: ఏపీ ప్రజలకు ఊరట.. 10 జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం.. వివరాలివే.!

ఏపీ ప్రజలకు ఊరటను ఇచ్చే వార్త. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల ప్రభావం...

Corona In AP: ఏపీ ప్రజలకు ఊరట.. 10 జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం.. వివరాలివే.!
Ap Corona
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2021 | 11:13 AM

ఏపీ ప్రజలకు ఊరటను ఇచ్చే వార్త. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. ఒక సమయంలో 24 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 16 వేలకు తగ్గిందంటే వైరస్‌ తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడం, కోవిడ్‌ నిబంధనలు పాటించడం వంటి వాటితో 10 జిల్లాల్లో కోవిడ్‌ తగ్గుముఖం పట్టింది.

ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 7 వారాల సగటు లెక్కిస్తే.. ఈ 10 జిల్లాల్లో కరోనా వైరస్‌ దాదాపు అదుపులోకి వచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రభుత్వం సూచిస్తుంది. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీలో మూడు జిల్లాలోనే కేసులు ఎక్కువగా కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. మే 20 నుంచి 26 మధ్య కాలంలో నమోదైన కేసుల పరంగా చూస్తే ఈ మూడు జిల్లాలోనూ కేసులు తగ్గాయి. 6వ వారంతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లో 7వ వారంలో కేసులు తగ్గాయి.

దీన్నిబట్టి చూస్తే దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉన్నాయి. టెస్టుల సంఖ్యను బట్టి చూసినా, జనాభాను బట్టి చూసినా గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 57 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 23 లక్షల 98 వేలకు పైగా టెస్టులు చేశారు. 4,09,000 మందికి పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో పట్టణాల్లో 14లక్షల 10వేల టెస్టులు జరిగాయి. ఇందులో 3,31,000 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 70.54 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. 29.46 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు. జనాభా లెక్కన చూసినా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో పాజిటివిటీ రేటు 6.4 శాతం ఎక్కువగా నమోదైంది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!