Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భార్యా పిల్లలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కడపలోని కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి, సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.. కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి తుపాకీతో ఇంటికొచ్చాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో

Andhra Pradesh: భార్యా పిల్లలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?
Ysr Kadapa District News
Follow us
Sudhir Chappidi

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 05, 2023 | 12:39 PM

కడప, అక్టోబర్ 05: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కడపలోని కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి, సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.. కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి తుపాకీతో ఇంటికొచ్చాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో తన కుటుంబాన్ని కాల్చి చంపి.. తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నగరంలోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న రైటర్ వెంకటేశ్వర్లు నిన్న రాత్రి 11గంటల వరకు కడప రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించాడు. అనతంతరం ఇంటికి వస్తూ తన సరెండర్‌లో ఉన్న తుపాకీని ఇంటికి తీసుకొని వచ్చారని కడప డీఎస్పీ షరీఫ్‌ తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రాథమిక విచారణలో అన్ని తేలుతాయన్నారు. ఆత్మహత్యకు ముందు వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాశారని.. ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా ప్రస్తావించారని.. విచారణ అనంతరం ఆ విషయాలన్నీ తేలుతాయన్నారు. ముఖ్యంగా రెండో భార్యకు సంబంధించి సూసైడ్ లెటర్‌లో రాసినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. అయితే, వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు చేసుకోవడానికి ఉపయోగించిన తుపాకీ ఆయనది కాదని డీఎస్పీ షరీఫ్‌ తెలిపారు. నిన్న రాత్రి 11 గంటల వరకు పీఎస్‌లో వర్క్ చేసిన ఆయన వస్తూ ఎవరిదో పిస్తోలు తెచ్చుకున్నట్లు చెప్పారు.. విచారణ తర్వాత అన్ని వివరాలను చెబుతామని తెలిపారు.

రెండో భార్యే.. కారణమా?

రైటర్ వెంకటేశ్వర్లు తాను చనిపోయే ముందు స్టాంప్ పేపర్లలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా రాశారు. అందులో ముఖ్యంగా తనకు వచ్చే బెనిఫిట్స్ తన రెండో భారీకి చెందాలని.. అలానే తన ఉద్యోగాన్ని రెండో భార్య కుమారుడికి ఇవ్వాలని జిల్లా ఎస్పీకి రాశారు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్నట్లు వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. చనిపోయిన వెంకటేశ్వర్లు.. మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి అమ్మాయి బీటెక్ చదువుతుండగా.. రెండవ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది.

రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్లో రాసిన విధంగా తన బెనిఫిట్స్ అన్నీ కూడా రెండో భార్యకు వచ్చేలాగా చూడాలని సూసైడ్ నోట్ రాయడంతో పోలీసులు ఆ విషయం పైనా కూడా ఆరాతీస్తున్నారు. రెండో భార్య వల్లే ఈ ఆత్మహత్య జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కానిస్టేబుల్‌ సూసైడ్ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..