Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సందు గొందుల్లో ఎక్స్చేంజ్.. ఇప్పటివరకు చూడని ఓ ఘరానా మోసం.. ఏపీలో వెలుగులోకి..

Currency exchange case: సాధారణంగా ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్‌ చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లోనో.. కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లోనో మార్చుకుంటారు. కానీ.. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో సందు, గొందుల్లోనూ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు చూడని ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: సందు గొందుల్లో ఎక్స్చేంజ్.. ఇప్పటివరకు చూడని ఓ ఘరానా మోసం.. ఏపీలో వెలుగులోకి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2023 | 10:29 AM

Currency exchange case: సాధారణంగా ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్‌ చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లోనో.. కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లోనో మార్చుకుంటారు. కానీ.. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో సందు, గొందుల్లోనూ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు చూడని ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తమ చేతిలో ఉన్న బ్యాగ్‌లోనే 16 లక్షలు విలువ చేసే కువైట్ దినార్లు ఉన్నాయని చెప్పారు మోసగాళ్లు. జస్ట్ ఎనిమిది లక్షలు ఇస్తే బ్యాగ్ సొంతం చేసుకోవచ్చనే మాయమాటలతో ట్రాప్‌లో పడిపోయాడు అనంతపురానికి చెందిన మజార్ అహ్మద్. కూల్ డ్రింక్ షాప్ నిర్వహించే మజార్ దగ్గర వారం రోజుల క్రితం సలీం అనే వ్యక్తి వచ్చి ఏం చక్కా మాటలు కలిపేశాడు. తనది బీహార్‌ అని.. తన వద్ద దుబాయ్‌ కరెన్సీ ఉందని 8 లక్షలు ఇస్తే, 16 లక్షలు అప్పగిస్తానని ఆశ చూపాడు. సలీం.. దుబాయ్‌ నోటు ఒకటి పరిశీలనకు ఇవ్వగా.. చెక్‌ చేసుకుని డీల్ కుదుర్చుకున్నాడు. మజార్‌ అహ్మద్‌ తన భార్య ఫరీదాతో కలిసి 8 లక్షలు తీసుకుని బత్తలపల్లిలో ఉన్న సలీంకు అందజేశాడు.

దినార్లకు బదులు చిత్తు కాగితాలు..

ఇదిలావుంటే.. బత్తలపల్లిలో సలీంతోపాటు మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. బ్యాగ్ అప్పుడే ఓపెన్ చేయొద్దు.. తాము వెళ్లిపోయిన తర్వాత చూసుకోవాలని చెప్పి డబ్బుల బ్యాగ్‌తో ఉడాయించారు. దాంతో.. కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసిన మజార్ అహ్మద్ షాక్‌ అయ్యారు. అందులో ఒక్క దినార్ కూడా లేకపోగా.. బ్యాగులో చిత్తు కాగితాలు పెట్టి మధ్యలో ఒక సబ్బు బిళ్ళను ఉంచడం ఆశ్చర్యం కలిగించింది. మోసం బట్టబయలైంది. కంగుతున్న మజార్, అతని భార్య బైక్‌పై చుట్టుపక్కలంతా గాలించినప్పటికీ.. అప్పటికే కేటుగాళ్లు పరారయ్యారు. లబోదిబోమన్న బాధితులు.. బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు తమ పరిధిలోకి రాదంటూ.. అనంతపురంలోనే కంప్లైంట్‌ చేయాలని సూచించారు. బత్తలపల్లి పోలీసులు కేటుగాళ్ళ కోసం ఎక్కడైతే మనీ ఎక్స్చేంజ్ జరిగిందో ఆ సందుల్లో వెతికారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం వన్ టౌన్ పోలీసులు.

మొత్తానికి.. కేటుగాళ్ళు సీసీ కెమెరాలు లేని చోటే డీల్ క్లోజ్ చేయడం ఈ కేసులో మరో హైలెట్‌గా చెప్పొచ్చు. ఈ వ్యవహారమంతా మజార్ అహ్మద్ భార్య తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించడం మరో కొసమెరుపు. మోసం చేసిన సలీంకు సంబంధించిన వ్యక్తులు మరో ఏడుగురు పక్కన వ్యాన్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. దురాశ దుఃఖానికి చేటు అనే విషయం మరోసారి రుజువు అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..