TV9 News: టీడీపీ దీక్షలు.. పవన్‌కి వైసీపీ కౌంటర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమోషనల్
సత్యమేవ జయతే పేరిట టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. జైల్లోనే చంద్రబాబు నిరాహార దీక్ష చేయనుండగా.. రాజమండ్రిలోని TDPకార్యాలయం ముందు నారా భువనేశ్వరి దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ చంద్రబాబు, భువనేశ్వరి దీక్షలకు మద్దతుగా ఎంపీ కనకమేడల నివాసంలో దీక్ష చేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఈ రోజు టోటల్ న్యూస్ హెడ్ లైన్స్ తెలుసుకుందాం పదండి...
హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితబంధు పథకం కింద మురుగువ్యర్ధాల రహణా వాహనాలను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రసంగం మధ్యలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు..
అటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రోజుకో విధంగా నిరసనలు చెబుతోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు టీడీపీ పిలుపునిచ్చింది. సత్యమేవ జయతే పేరిట టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు.విశాఖలో పద్మనాభం పోలీసులు ఓ యువకుడిపై పైశాచికంగా ప్రవర్తించారు..కోడి దొంగతనం చేశారన్న నెపంతో యువకుడిని చితకబాదారు ఇద్దరు కానిస్టేబుళ్లు..మూడు రోజుల పాటు విచారణ పేరుతో టార్చర్ చూపించారు.
జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు..గాంధీ 154వ జయంతి. దీంతో రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్దకు వెళ్ళిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. ఈ రోజు టోటల్ న్యూస్ హెడ్ లైన్స్ తెలుసుకుందాం పదండి…