Police Vehicle: పోలీసు వాహనంపై యువతి విన్యాసాలు.. అనుమతిచ్చిన పోలీసు ఆఫీసర్‌ ఏమయ్యాడో తెలుసా.

Police Vehicle: పోలీసు వాహనంపై యువతి విన్యాసాలు.. అనుమతిచ్చిన పోలీసు ఆఫీసర్‌ ఏమయ్యాడో తెలుసా.

Anil kumar poka

|

Updated on: Oct 02, 2023 | 10:00 AM

ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం పోలీస్‌ వాహనం బాన్‌ట్‌పైకి ఎక్కి రచ్చ చేసింది. పంజాబీ పాటకు యాక్టింగ్ చేస్తూ.. ఫోజులిచ్చింది. అదే సమయంలో మిడిల్ ఫింగర్ చూపిస్తూ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో అటు ఇటూ తిరిగి పోలీసు ఉన్నతాధికారుల కంట పడింది. పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్ చేసేందుకు

ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం పోలీస్‌ వాహనం బాన్‌ట్‌పైకి ఎక్కి రచ్చ చేసింది. పంజాబీ పాటకు యాక్టింగ్ చేస్తూ.. ఫోజులిచ్చింది. అదే సమయంలో మిడిల్ ఫింగర్ చూపిస్తూ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో అటు ఇటూ తిరిగి పోలీసు ఉన్నతాధికారుల కంట పడింది. పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్ చేసేందుకు అనుమతి ఇచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మ, యువతి కారుపై కూర్చుని వీడియో రికార్డు చేసేందుకు అనుమతించారు. దీంతో, ఆమె కారు బానెట్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నట్టు చేతులు ఊపింది. అంతేకాకుండా, అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియావైరల్‌ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన పోలీసు శాఖ అశోక్ శర్మను సస్పెండ్ చేసింది. ఇటీవలే మరో యువతి ఇదే తరహాలో కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ఇన్‌స్టా రీల్స్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన అకౌంట్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక మిలియన్ దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని యువతి ఇలాంటి రీల్ చేసి చిక్కుల్లో పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..