Viral: వృద్ధుడి రూపంలో వచ్చిన ప్రత్యక్ష దైవం.. నాలుగేళ్ల చిన్నారికి పునర్జన్మ.

Viral: వృద్ధుడి రూపంలో వచ్చిన ప్రత్యక్ష దైవం.. నాలుగేళ్ల చిన్నారికి పునర్జన్మ.

Anil kumar poka

|

Updated on: Oct 02, 2023 | 11:16 AM

యూపీలోని వారణాసిలో సెప్టెంబర్‌ 26 ఉదయం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి కరెంటు వైర్ ను తాకడంతో షాక్ కొట్టింది. దాంతో చిన్నారి రోడ్డుపై ఉన్న నీళ్లల్లో పడిపోయి కొట్టుకుంటోంది. సుమారు ఓ నిమిషం పాటు చిన్నారి కరెంట్‌ షాక్ తో నీళ్లలోనే తల్లడిల్లిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు చాలా మంది చిన్నారిని కాపాడటానికి ప్రయత్నించారు.

యూపీలోని వారణాసిలో సెప్టెంబర్‌ 26 ఉదయం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి కరెంటు వైర్ ను తాకడంతో షాక్ కొట్టింది. దాంతో చిన్నారి రోడ్డుపై ఉన్న నీళ్లల్లో పడిపోయి కొట్టుకుంటోంది. సుమారు ఓ నిమిషం పాటు చిన్నారి కరెంట్‌ షాక్ తో నీళ్లలోనే తల్లడిల్లిపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు చాలా మంది చిన్నారిని కాపాడటానికి ప్రయత్నించారు. కానీ కరెంట్‌ షాక్‌ కొట్టడంతో వెనుదిరిగారు. వారిలో ఓ వృద్ధుడు ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి చిన్నారిని రక్షించాడు. అటుగా ఆటోలో వెళ్లున్నాడు ఓ వృద్ధుడు. అక్కడి పరిస్థితి గమనించిన ఆటో డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కి మళ్లించాడు.. కానీ, ఆటోలో ఉన్న వృద్ధుడు చిన్నారిని చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ కరెంట్ షాక్ తగలడంతో ఆయన కూడా వెనక్కి వచ్చేశారు. ఇదంతా గమనించిన మరో వృద్ధుడు పరిస్థితిని అర్ధం చేసుకొని వేగంగా స్పందించారు. చుట్టు పక్కల అటూ, ఇటూ తిరిగి ఓ కర్రను వెతికి పట్టుకొచ్చారు. ఆ కర్రను పట్టుకోవాలని బాలికకు చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత ఆ బాలిక కర్రను పట్టుకుంది. దీంతో ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు లాగారు. అలా ఆ బాలిక క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధుడి సమయస్పూర్తిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..