AP News: 5 నుంచి ‘మేలుకో తెలుగోడా’ పేరుతో భువనేశ్వరి బస్సు యాత్ర..!
పోలీసులు ఏం చేసినా బెదరకుండా.. నిరసనలు, నిరాహారదీక్షలు చేస్తున్న కార్యకర్తలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా దృఢంగా ఉండే వ్యక్తి.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటానికి కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ.. ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 5న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మంగళ, బుధ వారాల్లో కోర్టుల్లో వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. 5వ తేదీ నుంచి యాత్ర మొదలైతే.. ‘మేలుకో తెలుగోడా’ పేరుతో మొదట రాయలసీమ జిల్లాల్లో కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు అయినప్పటికీ నుంచి.. భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. నిరసన కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చే పలువురు నేతలను కలుస్తున్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేపట్టారు. బాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. భువనేశ్వరి యాత్ర చేపడితే.. వైసీపీని ఎండగట్టడంతో పాటు.. పార్టీకి మైలేజ్ వస్తుందన్నది టీడీపీ యోచనగా తెలుస్తోంది. గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో ఉన్నప్పుడు.. ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అప్పట్లో షర్మిల యాత్ర వైసీపీ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసింది.
అటు జైలులో చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు నారా భువనేశ్వరి. జైలులో ఉన్నా.. పార్టీ కార్యకర్తలు, తెలుగు జాతి గురించే చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారామె. చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేస్తున్నారనీ.. కనీసం భోజనం చేయడానికి టేబుల్ కోసం కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారామె. తెలుగుదేశం కార్యకర్తలు తమ బిడ్డలతో సమానమన్నారు. తల్లిదండ్రుల కోసం కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడుతున్నారన్నారు.
పోలీసులు ఏం చేసినా బెదరకుండా.. నిరసనలు, నిరాహారదీక్షలు చేస్తున్న కార్యకర్తలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా దృఢంగా ఉండే వ్యక్తి.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటానికి కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారనీ చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది పొందిన విద్యార్ధులు.. సీఈవో స్థాయికి వెళ్ళారన్నారు. అహర్నిశలూ.. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలనేదే చంద్రబాబు అలోచన. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు.
భువనేశ్వరిని పరామర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున రాజమండ్రికి వస్తుండడంతో.. బస్సులో కాకుండా RV నగర్ సమీపంలోని ఓ భవనంలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ భవనం యువగళం సందర్భంగా నారా లోకేష్ ఏర్పాటు చేసుకున్న క్యాంప్ ఆఫీస్. అక్కిన మునేశ్వర రావుకు చెందిన ఈ భవనంలోనే ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి ఉంటున్నారు. ఇక్కడి నుంచే చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఇంటి భోజనం, సమయానికి మందులు తీసుకెళ్తున్నారు. భువనేశ్వరి ఉన్న భవనంలోకి ఇతరులు వెళ్లకుండా లోకేశ్ అనుచరులే గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..