ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు

Ram Naramaneni

|

Updated on: Oct 02, 2023 | 11:30 AM

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపింది. ఈనెల 4న నారా లోకేష్‌తో పాటు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించనున్నారు అధికారులు. ఈ కేసులో నారాయణ ఏ2గా ఉన్నారు. గతంలో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ ఒక ప్రీప్లాన్డ్ స్కామ్ అంటోంది ప్రభుత్వం. విచారణకు ఆదేశించడంతో CID రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు పేరు చేర్చారు. A2గా నారాయణ ఉన్నారు. A14గా నారా లోకేష్‌ పేరు కూడా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే నారాయణకు ముందస్తు బెయిల్ వచ్చింది. చంద్రబాబు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా చంద్రబాబు, లోకేష్‌, లింగమనేని, నారాయణ, ప్రతిపాటి ఇలా పలువురు వ్యక్తులు వందల కోట్ల రూపాయల లబ్ది పొందారని CID ఆరోపిస్తోంది. 97 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం ద్వారా తమ వాళ్లకు మేలు చేసేలా కుట్ర చేశారని దీనిపైనే లోతైన దర్యాప్తు చేస్తున్నామని CID అధికారులు చెప్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 02, 2023 11:24 AM