జగన్ ఓడిపోతాడు.. మేం అధికారంలోకి వస్తాం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుంటారు. రేపు, ఎల్లుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కృష్ణా జిల్లా జనసేన నేతలతో పవన్ సమావేశమవుతారు.
ఇక అక్టోబర్ 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవ్వనున్నారు పవన్. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవించేవారితో సమావేశమయ్యి.. వారికి భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. 4వ తేదీన పెడనలో.. 5వ తేదీన కైకలూరులో వారాహి యాత్రను కొనసాగిస్తారు పవన్. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని ఆదేశించారు టీడీపీ నేత లోకేష్. కాగా అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌కు భారీ ఎత్తున జనాలు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు పవన్.
Published on: Oct 01, 2023 06:21 PM
వైరల్ వీడియోలు
Latest Videos